ఆక్సిజన్ కొరత తీరింది, ఇప్పుడు వ్యాక్సిన్ల వంతు, కేంద్రం ముందు మళ్ళీ మోకరిల్లిన ఢిల్లీ ప్రభుత్వం, ఎన్నాళ్లీ దుస్థితి ?
ఇన్నాళ్లూ ఆక్సిజన్ కొరతతో సతమతమవుతూ వచ్చిన ఢిల్లీకి సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల పుణ్యమా అని ఆ కొరత తీరింది. ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. నగరంలో ఒక్కరోజుకు మాత్రమే సరిపడే కొవాగ్జిన్ వ్యాక్సిన్ ....
ఇన్నాళ్లూ ఆక్సిజన్ కొరతతో సతమతమవుతూ వచ్చిన ఢిల్లీకి సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల పుణ్యమా అని ఆ కొరత తీరింది. ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. నగరంలో ఒక్కరోజుకు మాత్రమే సరిపడే కొవాగ్జిన్ వ్యాక్సిన్, మూడు, నాలుగు రోజులకు మాత్రం సరిపడే కోవిషీల్డ్ టీకామందు ఉన్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.వెంటనే వీటి కొరతను తీర్చాలని కోరుతూ కేంద్రానికి అత్యవసర ఎస్ ఓ ఎస్ మెసేజ్ పంపినట్టు ఆయన చెప్పారు. నోయిడా, ఘజియాబాద్, గుర్ గావ్ వంటి పొరుగు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నెలలో 18 ఏళ్ళు పైబడినవారికి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడంతో కేంద్రం తన వ్యాక్సిన్ పాలసీని మార్చింది. దీని కింద రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి నేరుగా వ్యాక్సిన్ కొనుగోలు చేయవచ్చు. కాగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వాటి కోటా పరిమితంగా అందిందని ఈ కంపెనీలు చెబుతున్నాయి. అందువల్ల మరిన్ని డోసుల వ్యాక్సిన్ పంపాలంటే ఇంకొంత కాలం పట్టవచ్చునని భావిస్తున్నామని ఈ సంస్థలు వెల్లడించాయి. ఢిల్లీలో 18-44 ఏళ్ళ మధ్య వయస్కులు సుమారు కోటిమంది ఉన్నారని, వీరంతా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేజ్రీవాల్ తెలిపారు. కోటిన్నరమంది ప్రజలకు టీకామందు ఇవ్వాలంటే తమకు 3 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమని, కానీ ఇప్పటివరకు 50 లక్షల డోసులు మాత్రమే అందిందని ఆయన చెప్పారు. 18 ఏళ్ళు పైబడిన అందరికీ టీకామందు మూడు నెలల్లో ఇవ్వాలంటే నెలకు తమకు 83 లక్షల డోసులు అవసరమవుతాయని అయన కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
కాగ్గా ఢిల్లీయే కాదు..దేశంలో అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్నాయి. ఏపీ, రాజస్థాన్, బీహార్, హర్యానా మహారాష్ట్ర, వంటి పలు రాష్టాల్లో ఇంకా వ్యాకిన్స్ కొరత ఉంది. తమకు టీకామందులు కావాలని ఈ రాష్ట్రాలు కోరుతున్నాయి.,
మరిన్ని చదవండి ఇక్కడ : ఐసొలేషన్ లో సింహాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? జంతువులను సైతం వదలని కరోనా మహమ్మారి: Lions viral video. Vijay Deverakonda Liger teaser postponed:విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. లైగర్ టీజర్ వాయిదా! పూరీ టీం ట్వీట్..(వీడియో)