బెంగాల్ లో 43 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం, రాజ్ భవన్ లో నిరాడంబరంగా కార్యక్రమం, సీఎం మమత సన్నిహితులకు అందలం

బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రులుగా 43 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్ కతా లోని రాజ్ భవన్ లో గవర్నర్ జగ దీప్ ధన్ కర్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

బెంగాల్ లో  43 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం, రాజ్ భవన్ లో నిరాడంబరంగా కార్యక్రమం,  సీఎం మమత సన్నిహితులకు అందలం
43 Tmc Members Take Oath
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 10, 2021 | 4:44 PM

బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రులుగా 43 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్ కతా లోని రాజ్ భవన్ లో గవర్నర్ జగ దీప్ ధన్ కర్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అమిత్ మిత్రా, బ్రత్య బసు, రతిన్ ఘోష్ వర్చ్యువల్ గా ప్రమాణం చేశారు. అమిత్ మిత్రా అస్వస్థులుగా ఉండగా.. బసు, రతిన్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. 19 మంది ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. 24 మంది కేబినెట్ మంత్రులు, 19 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రుల్లో అనుభవం కలిగినవారు కొందరు ఉండగా…చాలామంది కొత్తవారే..ఇక సీఎం మమతా బెనర్జీకి సన్నహితులైనవారు కూడా ఎక్కువమంది ఉన్నారు. అమిత్ మిత్రాకు ఈ ఎన్నికల్లో టికెట్ లభించలేదు. అయితే ఉప ఎన్నికలో ఆయనను అసెంబ్లీకి ఎన్నికయ్యేలా చూడాలన్నది మమత యోచనగా ఉందని చెబుతున్నారు. 24 మంది కేబినెట్ మంత్రుల్లో మాజీ ఐపీఎస్అధికారి హుమాయూన్ కబీర్ ఒకరు. ఇలా ఉండగా సోమవారం సాయంత్రం మమత తమ కొత్త మంత్రులతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ఇటీవల జరిగిన హింసపై గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆయన డీజీపీ సహా ఉన్నతాధికారుల వద్ద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు అధికారులు స్టేటస్ రిపోర్టు ఇవ్వడంలేదని అసహనం ప్రదర్శించారు.అయితే మమతా బెనర్జీ ఆయన వైఖరిని పట్టించుకోలేదు.. లా అండ్ ఆర్డర్ కి ప్రాధాన్యమివ్వాలన్న ఆయన సూచనను పెడచెవిన పెట్టి రాష్ట్రంలో కోవిద్ అదుపునకు ఆమె ప్రయారిటీ ఇఛ్చారు. సోమవారం జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఆమె, గవర్నర్ ముభావంగానే ఉన్నారు. మొక్కుబడిగా ఈ కార్యక్రమం సాగింది. కాగా కొత్త మంత్రులకు మమత పోర్టు ఫోలియోలను కేటాయించవలసి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Billionaire employees: ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఉద్యోగులు ఉన్న సంస్థ ఎక్కడుందో తెలుసా? అక్కడ ఎంతమంది కొటీశ్వరులంటే..

ఆక్సిజన్ కొరత తీరింది, ఇప్పుడు వ్యాక్సిన్ల వంతు, కేంద్రం ముందు మళ్ళీ మోకరిల్లిన ఢిల్లీ ప్రభుత్వం, ఎన్నాళ్లీ దుస్థితి ?