SASIKALA RE-ENTRY: చిన్నమ్మ తెరచాటు రాజకీయం షురూ.. చెన్నై ఆఫీసు ఎదుట శశికళ అనుకూల వర్గం ఏంచేసిందంటే?

పొలిటికల్ రీఎంట్రీకి శరవేగంగా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్నా డిఎంకేపై తమ పట్టు కోసం ఓ వైపు న్యాయపోరాటం కొనసాగిస్తున్న శశికళ.. తాజాగా పార్టీలోని తన సహచరుల సాయంతో ప్రస్తుత నాయకత్వంపై...

SASIKALA RE-ENTRY: చిన్నమ్మ తెరచాటు రాజకీయం షురూ.. చెన్నై ఆఫీసు ఎదుట శశికళ అనుకూల వర్గం ఏంచేసిందంటే?
Sasikala
Follow us
Rajesh Sharma

|

Updated on: May 10, 2021 | 5:17 PM

SASIKALA RE-ENTRY INTO TAMILNADU POLITICS: పొలిటికల్ రీఎంట్రీకి శరవేగంగా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్నా డిఎంకే (ANNA DMK)పై తమ పట్టు కోసం ఓ వైపు న్యాయపోరాటం కొనసాగిస్తున్న శశికళ (SASIKALA).. తాజాగా పార్టీలోని తన సహచరుల సాయంతో ప్రస్తుత నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే చర్యలను చాపకింద నీరులా ప్రారంభించారు. శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే తరఫున చెన్నై (CHENNAI) సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున పోస్టర్లు వెలిశాయి. ఈ విషయం పార్టీ వర్గాల్లో సంచలనం కలిగించింది. చెన్నైలో అన్నా డిఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట, పుదుక్కోట్టై (PUDUKOTTAI) ప్రాంతంలో శశికళ రీఎంట్రీని కోరుతూ పోస్టర్లు అతికించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్నాడీఎంకే ప్రతిపక్షనేత పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఓపీఎస్‌ (OPS) తరఫున ఒక వర్గం, ఎడపాడి పళనిస్వామి (PALANI SWAMY) ఆధ్వర్యంలో ఓ వర్గం పోటీ పడ్డాయి. అయితే.. చివరికి ఫళనిస్వామి వర్గానిదే పైచేయి అయ్యింది, ఫళనిస్వామి తమిళనాడు అసెంబ్లీ (TAMILNADU ASSEMBLY)లో ప్రతిపక్ష నేత (OPPOSITION LEADER)గా ఎన్నికయ్యారు.

కాగా రెండు రోజుల క్రితం ఎడపాడి పళనిస్వామి కారును ఓపీఎస్‌ వర్గం అటకాయించి నినాదాలు చేసింది. ఆ తర్వాత అన్నాడీఎంకే నిర్వాహకుల సమావేశంలోను విపక్ష నేత ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారంలో శశికళ తెరవెనుక నుంచి ఓపీఎస్‌కు మార్గదర్శకం చేస్తున్నట్లు వార్తలు వెలువడడంతో సంచలనం ఏర్పడింది. ఇలావుండగా చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎదురుగా శశికళకు మద్దతు తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి. వీటి వెనుక పన్నీరు సెల్వం అనుచరుల హస్తమున్నట్లు ప్రచారం జరిగింది. ఫళనిస్వామిని పరోక్షంగా హెచ్చరికలు పంపేదుకే శశికళను స్వాగతిస్తూ పోస్టర్లు అతికించినట్లు భావించారు. పోస్టర్ల ప్రభావమో లేక మరే కారణమైదేనా వుందేమో కానీ మే 10న మధ్యాహ్నానికి ఓపీఎస్-ఈపీఎస్ మధ్య సయోధ్య కుదిరింది. మాజీ ముఖ్యమంత్రి ఫళనిస్వామియే అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికయ్యారు. పన్నీరు సెల్వం ఈ విషయంలో వెనక్కి తగ్గారు.

అలాగే పుదుక్కోట్టై ప్రాంతంలోను అన్నాడీఎంకే కార్యకర్తల తరఫున పోస్టర్లు అతికించారు. ఎంజీఆర్‌ (MGR) రూపొందించిన, జయలలిత (JAYALALITA) కాపాడిన పార్టీని శశికళ ఆధ్వర్యంలో నడిపిద్దామని అందులో రాశారు. అన్నాడీఎంకే పార్టీని గట్టెక్కించాలంటే చిన్నమ్మ అలియాస్ శశికళ వంటి బలమైన, వ్యూహకర్త  (STRATEGIST) సారథ్యం అవసరమని పార్టీ వర్గాలిప్పటికే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. స్టాలిన్ లాంటి దిగ్గజ, సీనియర్ నేత వ్యూహాల నుంచి అన్నా డిఎంకేను కాపాడుకోవాలంటే చిన్నమ్మ సారథ్యం అవసరమని అంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (TAMILNADU ASSEMBLY ELECTION RESULTS) వెలువడిన వెంటనే ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు, భవిష్యత్ వ్యూహాలకు తెరలేచినట్లు తమిళ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో వున్న అన్నా డిఎంకే (ANNA DMK) పరాజయాన్ని ముందే ఊహించి.. కొందరు ఢిల్లీ పెద్దల సలహా మేరకు రాజకీయ సన్యాసం తీసుకున్న చిన్నమ్మ అలియాస్ శశికళ (SASIKALA) తిరిగి పాచికలు కదపడం అప్పుడే ప్రారంభించినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో (TAMIL POLITICAL CIRCLE) పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. జయలలిత (JAYALALITA) మరణానంతరం పార్టీపై పట్టు సాధించినా.. కాలం కలిసి రాక జైలు పాలైన శశికళ… రాంగ్ టైమ్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. అన్నా డిఎంకేపై పట్టు సాధించే సమయం లేకుండానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (TAMILNADU ASSEMBLY ELECTIONS) నగారా మోగింది. దానికి తోడు చిన్నమ్మ పెద్దరికాన్ని ఏ మాత్రం ఇష్టపడని ఫళనిస్వామి (PALANISWAMY), పన్నీరుసెల్వం (PANNIR SELVAM).. అధికారంలో వుండడంతో చిన్నమ్మ వ్యూహాలు అమలు పరచడం అంత ఈజీ కాలేదు. దానికి తోడు తనని పదే పదే నిలువరిస్తున్న ఢిల్లీ పెద్దలు కూడా ప్రతికూలంగానే వున్నారు. దాంత చేసేదేమీ లేక ఫ్యూచర్‌లో చూసుకుందామనుకుందో ఏమో ఫిబ్రవరిలో రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు శశికళ.

ఇదంతా గతం… రెండు నెలల కాలం గిర్రున తిరిగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో తమిళనాడు (TAMILNADU) ఎన్నికల ప్రచారంతో హోరెత్తిపోయింది. కొత్తగా రాజకీయ అవతారమెత్తిన కొందరు సినీ నటులతో కలిసి.. తమిళనాడు ఎన్నికల ప్రచారం (TAMILNADU ELECTION CAMPAIGN) ఆద్యంతం రక్తి కట్టింది. ఏదైతేనేం పదేళ్ళుగా అధికారానికి దూరమైన ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకే) పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 234 మంది సభ్యులు గల తమిళనాడు అసెంబ్లీ (TAMILNADU ASSEMBLY)లో ఏకంగా 160 సీట్లను డిఎంకే (DMK) పార్టీ గెలుచుకుంది. దాంతో పద్నాలుగేళ్ళ ప్రాయంలో కన్న కలను నెరవేర్చుకోవడం ద్వారా 68 ఏళ్ళ ఎంకే స్టాలిన్ (MK STALIN) తమిళనాడు ముఖ్యమంత్రి (TAMILNADU CHIEF MINISTER)గా మే నెల 7వ తేదీన పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఇటు జయలలిత మరణంతో అదృష్టం కొద్ది దక్కిన ముఖ్యమంత్రి (CHIEF MINISTER) పీఠాన్ని కాపాడుకోవడంలో సిట్టింగ్ సీఎం ఫళని స్వామి విఫలమయ్యారు. పన్నీరు సెల్వంతో కలిసి తిరిగి అధికారంలోకి రావడానికి యధాశక్తి ప్రయత్నించారు ఫళనిస్వామి. కానీ.. ప్రభుత్వ వ్యతిరేకత, ద్రవిడులు అస్సలు సహించని బీజేపీతో దోస్తీ వెరసి పళని కలలకు షాక్ తగిలింది. అయితే.. కారణాలేంటో గానీ.. తమిళనాడులో బీజేపీ (BJP) అయిదు సీట్లను సాధించుకోగలిగింది.

ఇదంతా ఫలితాలు వెల్లడైన తర్వాత తెరమీద జరుగుతున్న కథ. కానీ తెరచాటు పరిణామాలు కూడా వేగవంతమైనట్లు తాజాగా తమిళ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ (TAMILNADU ASSEMBLY) ఎన్నికలకు ముందు అనూహ్యంగా రాజకీయ సన్యాసాన్ని ప్రకటించిన శశికళ (చిన్నమ్మ)  తెరచాటు రాజకీయాలను మాత్రం కొనసాగిస్తూనే వుంది. పేరుకే రాజకీయాలకు రామ్ రామ్.. కానీ రాజకీయాలపై మాత్రం అదే ఆసక్తి. కేవలం ఆసక్తే కాదు.. తెరచాటుగా రాజకీయ పావులు కూడా కదుపుతున్నారు శశికళ (SASIKALA). అస్త్ర సన్యాసం చేసిన తర్వాత పూర్తిగా ఆధ్యాత్మికంగా వుండిపోతున్నట్లు పైకి కనిపించినా.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. పరోక్షంగా అన్నా డిఎంకే (ANNA DMK) పార్టీపై పట్టుకు యత్నిస్తూనే వున్నారు. అన్నాడీఎంకేపై న్యాయస్థానంలో ఆమె సాగిస్తున్న ఆధిపత్య పోరు కొనసాగిస్తూనే వున్నారు. జయలలిత (JAYALALITA) జీవించి ఉన్నంత వరకు నీడలా ఆమె వెన్నంటి ఉండిన శశికళ ఆ తరువాత ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అంతా జయను పోలినట్లుగా చీరకట్టు, నుదుటన బొట్టు, పాద నమస్కారాలు, ఆశీర్వచనాలతో ప్రారంభమైన చిన్నమ్మ వైభవం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునే వరకు సాగింది. ఆ తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది. నిజానికి ఈ కేసులో ఏ1 గా వున్న జయలలిత అప్పటికే మరణించడంతో ఏ2గా వున్న శశికళ ప్రధాన ముద్దాయి అయ్యారు. నాలుగేళ్ళ జైలు శిక్షకు వెసులుబాటు కల్పించుకునే అవకాశాలు ఏ మాత్రం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె జైలుకు వెళ్ళారు.

మరోవైపు అన్నా డిఎంకే నుంచి సస్పెండై వేరు కుంపటి పెట్టుకున్నాడు శశికళ అన్న కొడుకు టిటికే దినకరన్ (TTK DINAKARAN). ఆ పార్టీతో వుంటున్నట్లే వుంటే అన్నా డిఎంకేపై కన్నేశారు శశికళ. జైలు నుంచి విడుదలై అట్టహాసంగా చెన్నై చేరుకున్న శశికళ.. తనకు చక్రం తిప్పే సమయం లేకపోవడంతో  వ్యూహాత్మకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన చిన్నమ్మ.. తాజాగా ఫళనిస్వామి, పన్నీరు సెల్వంలకు వ్యతిరేకంగా వున్న అన్నా డిఎంకే నేతలకు సంకేతాలు పంపడం అప్పుడే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం బలంగా వుంటే భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం వుంటుందని, బలహీన నాయకత్వం వుంటే.. స్టాలిన్ దూకుడు ముందు అన్నా డిఎంకే తుత్తునియలు కాకతప్పదని పలువురు అన్నా డిఎంకే నేతలు భావిస్తున్న నేపథ్యంలో చిన్నమ్మ లాంటి స్ట్రాంగ్ లీడరే తమకు కావాలని పలువురు కోరుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో ఓటమికి సీఎం ఫళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలే కారణమని అప్పుడే పలువురు అన్నా డిఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటమిని కారణంగా చూపి.. చిన్నమ్మ వుంటేనే భవిష్యత్తు అనే రకంగా పార్టీలో తన అనుకూల వాదులతో మాట్లాడించడం ద్వారా తిరిగి పార్టీలోకి రావడమే కాదు.. అనతికాలంలోనే పార్టీపై గ్రిప్ సాధించేందుకు చిన్నమ్మ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

ALSO READ: కరోనా మృతుల విషయంలో ఆందోళన వద్దు.. జాగ్రత్తలతో అంత్యక్రియలు నిర్వహించినా ప్రమాదమేమీ లేదు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!