Himanta Biswa Sarma: అసోం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ.. రాజ్‌భవన్‌‌లో నిరాడంబరంగా ప్రమాణస్వీకారం

అసోం 15వ ముఖ్యమంత్రి బీజేపీ నేత, ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ(52) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.

Himanta Biswa Sarma: అసోం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ.. రాజ్‌భవన్‌‌లో నిరాడంబరంగా ప్రమాణస్వీకారం
Himanta Biswa Sarma Sworn In As Assam Cm
Follow us
Balaraju Goud

|

Updated on: May 10, 2021 | 1:17 PM

Himanta Biswa Sarma Sworn-in As CM: అసోం 15వ ముఖ్యమంత్రి బీజేపీ నేత, ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ(52) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. డిస్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జగదీశ్‌ ముఖీ ఆయన చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌, త్రిపుర సీఎం బిప్లబ్​ దేబ్​, మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్‌ సంగ్మా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్​, నాగాలాండ్ సీఎం నీఫ్యూ రియో తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారానికి ముందు డౌల్ గోవింద ఆలయం, కామాఖ్యా దేవి దేవాలయాలను సందర్శించిన హిమంత బిశ్వ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీకి మూడు విడుతల్లో ఎన్నికలు జరగ్గా.. బీజేపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 60, ఏజీపీ, తొమ్మిది, యూపీపీఎల్‌ ఆరు స్థానాల్లో గెలుపొందాయి. ఆదివారం జరిగిన బీజేపీ సమావేశంలో శాసనసభా పక్ష నేత హిమంత బిశ్వ శర్మను ఎన్నుకున్నారు. దీంతో సర్బానంద సోనోవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి శర్మ పేరును మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ ప్రతిపాదించారు. ఇదిలావుంటే, ప్రస్తుత మాజీ సీఎం సోనోవాల్‌కు కేంద్ర కేబినెట్‌లో స్థానం దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది. హిమంత బిశ్వ శర్మ గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Read Also…  యమునా నదిలో తేలియాడుతున్న డజన్ల కొద్దీ మృతదేహాలు, స్థానికుల్లో భయాందోళనలు, యూపీ జిల్లాల్లో అధికారులు అప్రమత్తం