Viral: వీధి కుక్కలకు ‘లాక్‌డౌన్‌’ కష్టాలు.. వారణాసిలో డ్యూటీలో ఉన్న పోలీస్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..!

కరోనా కష్టాలు మనుషులనే కాదు.. మూగజీవాలనూ సైతం వదలడంలేదు. లాక్‌డౌన్‌తో వీధికుక్కలు ఆహారం లేక అవస్థలు పడుతున్నాయి. రోజుల తరబడి ఆహారం లేకుండా అలమటిస్తున్నాయి.

Viral: వీధి కుక్కలకు ‘లాక్‌డౌన్‌’ కష్టాలు.. వారణాసిలో డ్యూటీలో ఉన్న పోలీస్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..!
Police Helps Thirsty Dog Viral Picture
Follow us
Balaraju Goud

|

Updated on: May 10, 2021 | 12:57 PM

Onduty Cop helps Thirsty Dog: కరోనా కష్టాలు మనుషులనే కాదు.. మూగజీవాలనూ సైతం వదలడంలేదు. లాక్‌డౌన్‌తో వీధికుక్కలు ఆహారం లేక అవస్థలు పడుతున్నాయి. రోజుల తరబడి ఆహారం లేకుండా అలమటిస్తున్నాయి. ముఖ్యంగా నోరున్న జీవులమైన మనకు తాగునీరు ఎలాగోలా లభిస్తుంది. కాలేకడుపుతో మంచి నీటి కోసం తపిస్తున్న ఓ వీధికుక్కకు దాహార్తి తీర్చాడు విధుల్లో ఉన్న ఓ పోలీస్.

హృదయానికి హత్తుకునే ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది హ్యాండ్ పంప్ వద్ద నీరు తాగేందుకు యత్నించిన ఓ వీధి కుక్కకు సహాయం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ ఫోటో ట్విట్టర్ వేదిక షేర్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని కాశీ విశ్వనాథ్ నగరంలో వెలుగు చేసింది.

వైరల్ అవుతున్న పోస్ట్‌ను ఐపీఎస్ అధికారి సుకీర్తి మాధవ్ షేర్ చేశారు అతను వెబ్ సిరీస్ పాటల్ లోక్ నుండి ఒక డైలాగ్‌ను ఉటంకిస్తూ ట్వీట్ చేసారు. “ఒక మనిషి కుక్కలను ప్రేమిస్తే, అతను మంచి మనిషి. కుక్కలు మనిషిని ప్రేమిస్తే, అతను మంచి మనిషి! నమ్మశక్యం కాని బనారస్ ..! ” అంటూ ట్వీట్ చేశారు.

ఈ ఫోటోకు ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రసారం కావడంతో, ఈ పోస్ట్‌ను 24,000 మందికి పైగా లైక్‌లను సంపాదించింది. వీధి కుక్క దాహం తీర్చిన పోలీస్‌ను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తారు. Read Also… Covid-19 Vaccine: వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇప్పటివరకూ 17 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ..