యమునా నదిలో తేలియాడుతున్న డజన్ల కొద్దీ మృతదేహాలు, స్థానికుల్లో భయాందోళనలు, యూపీ జిల్లాల్లో అధికారులు అప్రమత్తం

యూపీలోని హామిర్ పూర్ జిల్లాలో యమునా నది పూర్తిగా కలుషితమైపోయిందని స్థానికులు తెలిపారు. ఆదివారం ఈ నదిలో డజన్ల కొద్దీ మృతదేహాలు తెలియాడుతూ కనిపించాయని,,,,,

యమునా నదిలో తేలియాడుతున్న డజన్ల కొద్దీ మృతదేహాలు, స్థానికుల్లో భయాందోళనలు, యూపీ జిల్లాల్లో అధికారులు అప్రమత్తం
Dozens Of Bodies Floating In Yamuna River In Up
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 10, 2021 | 1:00 PM

యూపీలోని హామిర్ పూర్ జిల్లాలో యమునా నది పూర్తిగా కలుషితమైపోయిందని స్థానికులు తెలిపారు. ఆదివారం ఈ నదిలో డజన్ల కొద్దీ మృతదేహాలు తెలియాడుతూ కనిపించాయని,, ఈ పరిణామంతో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని వారు చెప్పారు.ఇవి బహుశా కోవిడ్ రోగుల డెడ్ బాడీలే అయిఉంటాయని వారు అనుమానిస్తున్నారు. శ్మశాన వాటికలో ఎక్కడా ఖాళీ లేకపోవడంతో ఇక ఈ నదిలో తమవారి మృతదేహాలను వారి బంధువులు విసిరి వేస్తున్నట్టు తెలుస్తోందని స్థానికులు భావిస్తున్నారు. ఈ మృతదేహాల కారణంగా తాము కూడా కోవిడ్ పాజిటివ్ కి గురవుతామేమోనని వీరు భయపడిపోతున్నారు. కాగా అధికారులే ఈ డెడ్ బాడీలను యమునలో వదలివేస్తున్నట్టు కూడా సమాచారం. హామీర్ పూర్ సమీప గ్రామాల్లో స్థానికులు కోవిద్ తో మరణించినవారిని ఈ నది తీరంలో,,పొలాల్లో దహనం చేయడమో, ఖననం చేయడమో చేస్తున్నట్టు కూడా వెల్లడైంది. దీంతో అసలు రాష్ట్రంలో ఎంతమంది కోవిద్ రోగులు మృతి చెందుతున్నారో అధికారులకు లెక్కలు తెలియకుండా పోతున్నాయి. తనకు సమాచారం ఇవ్వకుండా గ్రామీణులు ఇలా చేస్తుండడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. హామీర్ పూర్, కాన్పూర్ జిల్లాల మధ్య యమునా నది ప్రవహిస్తోంది. ఒకప్పుడు అత్యంత పవిత్రంగా భావించే ఈ నది ఇప్పుడు ఇలా మారిపోవడం సనాతనులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇలా ఉండగా ఈ రెండు జిల్లాల గ్ఫ్రామాల్లోని తాజా పరిస్థితిని అంచనా వేసిన అధికారులు అప్రమత్తమై ఈ గ్రామాల్లో శానిటైజేషన్ వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. కోవిడ్ తో మరణించిన వారి వివరాలు ఇవ్వాలని గ్రామస్థులను కోరుతున్నారు. ఈ గ్రామాల్లో పరిస్థితి ఇతర గ్రామాల్లో వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని హామీర్ పూర్ జిల్లా అధికారులు వెల్లడించారు. మరిన్ని చదవండి ఇక్కడ : Vijay Deverakonda Liger teaser postponed:విజయ్‌ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. లైగర్‌ టీజర్‌ వాయిదా! పూరీ టీం ట్వీట్..(వీడియో) ఐసొలేషన్ లో సింహాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? జంతువులను సైతం వదలని కరోనా మహమ్మారి: Lions viral video.