South Central Railway: దక్షిణ మధ్య రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
South Central Railway Paramedical Posts: కరోనా మహమ్మారిని దేశం నుంచి పారదోలడానికి అంతా ఏకమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ రైల్వే...
South Central Railway Paramedical Posts: కరోనా మహమ్మారిని దేశం నుంచి పారదోలడానికి అంతా ఏకమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ రైల్వే కూడా తమ వంతి కృషి చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రైల్వే బోగీలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా దక్షిణ మధ్య రైల్వే పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకోనున్నారు.
ముఖ్యమైన విషయాలు..
* కరోనా నేపథ్యంలో పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
* ఈ ఉద్యోగాలకు సెంట్రల్/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు/ మాజీ రైల్వే ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎంపికైన అభ్యర్థులు కోవిడ్ రోగులు చికిత్స పొందుతోన్న వార్డుల్లో సేవలు అందించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు సికింద్రాబాద్ లాలాగూడలోని సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో పని చేయాల్సి ఉంటుంది.
* ఈ పోస్టులకు ఎంపికై వారికి మార్చి 31, 2022 వరకు పనిచేసే అవకాశం కల్పించారు.
* ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో సంప్రదించాల్సి ఉంటుంది.
* ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాలకు scr.indianrailways.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Recruitment of Paramedical Staff on Contract Basis#IndiaFightsCorona #Unite2FightCorona pic.twitter.com/P4kXZmwPlO
— South Central Railway (@SCRailwayIndia) May 11, 2021
Also Read: Hyderabad Metro: లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు.. తాజా టైమింగ్స్ ఇవే
Telangana Lockdown: తెలంగాణా లాక్ డౌన్ పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
Work From Homeకే ఉద్యోగినుల మొగ్గు…తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు