AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work From Homeకే ఉద్యోగినుల మొగ్గు…తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలా మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రముఖ జాబ్స్ వెబ్ సైట్ ఇండీడ్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 

Work From Homeకే ఉద్యోగినుల మొగ్గు...తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు
Work From Home
Janardhan Veluru
|

Updated on: May 11, 2021 | 6:53 PM

Share

కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలమయ్యింది. ప్రజల విచక్షణ రహితా సంచారాలతో  కరోనా మహమ్మారి అత్యంత వేగంగా విస్తరోస్తోంది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే  రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలుచేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ ఆంక్షలు విధించాయి. గత ఏడాది కరోనా వైరస్‌ను గుర్తించిన తర్వాత లాక్ డౌన్లో అత్యవసరమున్న సంస్థలు మినహా అనేక సంస్థలు, కార్యాలయాలు బంద్ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో పనులు కానిచ్చేస్తున్నారు. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే సౌకర్యం కల్పించాయి పలు కంపెనీలు. దీంతో లక్షలాది మంది తమ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. మరికొందరు తమ సొంత ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రముఖ జాబ్స్ వెబ్ సైట్ ఇండీడ్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.

కార్యాలయాలు తిరిగి తెరిస్తే… వచ్చి పనిచేయడానికి సిద్ధమని 59 శాతం మంది ఉద్యోగులు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచే పనిచేయడమే బెటర్ అని అత్యధిక మహిళా ఉద్యోగినులు అభిప్రాయపడ్డారు. కుటుంబం, పిల్లలతో కలిసి ఉంటూ.. పని కొనసాగించవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. రివర్స్ మైగ్రేషన్(సొంత ఊళ్లకు వెళ్లిపోవడం) అనేది తాత్కాలికమని 45 శాతం యాజమాన్యాలు అభిప్రాయపడ్డాయి. వర్క్ ఫ్రం హోంను కొనసాగించాలన్న  యోచనలో ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న యాజమాన్యాల్లో 70శాతం అభిప్రాయం వ్యక్తంచేశారు. ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం వల్ల తమ ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని 75 శాతం యాజమాన్యాలు వెల్లడించాయి. చిన్న నగరాల్లో కూడా తమ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్న 30 శాతం యాజమాన్యాలు తెలిపాయి. తమ కంపెనీలు పిలిస్తే.. తిరిగి నగరాలకు వచ్చేందుకు సిద్ధమన్న 50శాతం మంది ఉద్యోగులు తెలిపారు.

దేశంలో కరోనా గుర్తించినప్పటి నుంచి ఐటీ పరిశ్రమల్లో ఉన్న 44.70లక్షల ఉద్యోగుల్లో 90 శాతం మంది వర్క్ ఫ్రం హోం  చేస్తున్నారు. విప్రో ఉద్యోగుల్లో 98 శాతం ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారని ఆ కంపెనీ వెల్లడించింది.

వర్క్ ఫ్రం హోంను అనుమతించిన దేశంలో టాప్ 5 కంపెనీలు

ఇన్ఫోసిస్.. కార్యాలయంలో రోజులో 3.5గంటలు పనిచేసి మిగతా పనిగంటలను ఇంటి నుంచి విధులను నిర్వహించే సౌకర్యం కల్పించిన కంపెనీ

ఐబీఎం ఇండియా… తన ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేందుకు కంపెనీ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసిన ఐబీఎం. వర్క్ ఫ్రం హోం వల్ల కంపెనీ కయ్యే ఖర్చు కూడా తగ్గుతుందన్న ఐబీఎం.

అసెంచర్.. టాప్ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ కంపెనీ అసెంచర్ కూడా తన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించింది. ఉద్యోగులు తమకనుకూలమైన వాతావరణంలో పనిచేసేందుకు వీలు కలుగుతుందన్న అసెంచర్

యాహూ ఇండియా.. అంతర్జాతీయ ఇంటర్నెట్ దిగ్గజం దేశంలోని ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసేందుకు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

ఏప్రిల్ మాసంలో పెరిగిన పోస్టింగ్స్… ఇదిలా ఉండగా మునుపటి మాసాలతో పోల్చితే గత నెల(ఏప్రిల్) ఉద్యోగ నియామకాలు గణనీయంగా పెరిగినట్లు ఇండీడ్.కామ్ వెల్లడించింది. 2020 ఫిబ్రవరి మాసంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఉద్యోగ పోస్టింగ్స్ 24 శాతం మేర పెరిగాయి. మార్చి మాసంలో 16 శాతం పెరిగినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి…ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. 24 గంటల్లో 20 వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..

ఒక ద‌శ‌లో మ‌ళ్లీ టెన్నిస్ ఆడ‌లేనేమో అనుకున్నా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన సానియా మీర్జా..