VACCINE WORKS: వ్యాక్సిన్ల సామర్థ్యంపై శుభవార్త.. కరోనా కొత్త వేరియెంట్లను సమర్థవంతంగా నిరోధిస్తున్న అమెరికన్ వ్యాక్సిన్లు
కరోనా కొత్త వేరియంట్లు వస్తున్న తరుణంలో ఇక మానవాళి వైరస్ ముప్పు నుంచి బయట పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతూనేవున్నాయి. ఈ విషయంలో తరచు తలెత్తుతున్న అనుమానాలకు తెర దించారు అమెరికన్ శాస్త్రవేత్తలు.
VACCINE WORKS AGAINST CORONA NEW VARIANTS: కరోనా కొత్త వేరియంట్లు వస్తున్న తరుణంలో ఇక మానవాళి వైరస్ ముప్పు నుంచి బయట పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతూనేవున్నాయి. ఈ విషయంలో తరచు తలెత్తుతున్న అనుమానాలకు తెరదించారు అమెరికన్ శాస్త్రవేత్తలు (AMERICAN SCIENTISTS). కరోనా కొత్త వేరియెంట్ల (CORONA NEW VARIENTS)పై కూడా వ్యాక్సిన్లు చక్కగా పని చేస్తున్నాయన్న శుభవార్తను వెల్లడించారు. 2019 డిసెంబర్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్ (CORONA VIRUS)కు, తాజాగా మ్యూటెంట్ అయి శరవేగంగా విస్తరిస్తున్న వైరస్‌కు చాలా తేడా వుంది. గతంలో గాలిలో కేవలం కొన్ని నిమిషాలపాటే వుండి అంతమయ్యేది కరోనా వైరస్. కానీ ప్రస్తుతం మ్యూటెంట్ అయిన కరోనా వైరస్ గాలిలో కొన్ని గంటల పాటు వుంటుందని పరిశోధనలు తేల్చాయి. కొత్తగా వెలుగు చూసిన B.1.617 వేరియెంట్‌పై కరోనా వ్యాక్సిన్లు చక్కగా పని చేస్తున్నాయని అమెరికన్ శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్త రకం కరోనా వేరియంట్‌ని నిరోధించగలుగుతున్నాయని వెల్లడించారు.
అమెరికా (AMERICAN)లో ఇప్పటి వరకు మూడు వ్యాక్సిన్లు అనుమతులు పొందగా ఆ మూడు కూడా కొత్త రకం బీ.1.617 వేరియెంట్ కరోనా వైరస్‌పై బాగా వర్కౌట్ అవుతున్నట్లు తెలిపారు. అమెరికాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NATIONAL INSTITUTE OF HEALTH) వెల్లడించిన నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్ (BHARAT)లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వేరియెంట్ (CORONA VARIENT)ను అమెరికన్ వ్యాక్సిన్లు విజయవంతంగా నిరోధించగలవు. అమెరికాలో ఫైజర్ (FYZER), మోడెర్నా (MODERNA), జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థల వ్యాక్సిన్లు అన్నిరకాల అనుమతులు పొందాయి. మిగతా రకాల వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ మూడు వ్యాక్సిన్ల ప్రభావం కొంత తక్కువగా వున్నప్పటికీ.. కొత్త రకం కరోనా వేరియెంట్‌ని నిరోధించడంలో చక్కగానే పని చేస్తున్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిన్ కల్లిన్స్ చెబుతున్నారు. ఫ్రాన్సిన్ కల్లిన్స్ ప్రకటన భారత్‌నుద్దేశించి చేసినదిగా పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. ఈ ప్రకటన ఆధారంగా అమెరికన్ వ్యాక్సిన్ల కోసం భారత్ పెద్ద ఎత్తున ఆర్డర్ పెట్టే అవకాశాలున్నట్లు అంఛనా వేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే.. మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికన్ వ్యాక్సిన్లు దేశంలోకి విరివిగా వచ్చేందుకు తాజాగా ఎన్ఐహెచ్ (NIH) చేసిన ప్రకటన దోహదపడే ఛాన్స్ కనిపిస్తోంది.
కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా వేరియెంట్లపై వ్యాక్సిన్లు ఎలా పని చేస్తున్నాయనే విషయంపై పలు దేశాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అధ్యయనాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మనదేశంలో ప్రస్తుతం విస్తరిస్తున్న బీ.1.617 వేరియెంట్‌పై అమెరికన్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బీ.1.617 వేరియెంట్ కరోనా వైరస్‌ను మూడు అమెరికన్ వ్యాక్సిన్లు నిరోధించగలుగుతున్నాయని తేల్చారు. అయితే.. ఈ వేరియెంట్‌ను భారత్ వేరియెంట్ అనడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. అలా పిలవడం సరికాదని.. ఈ వేరియెంట్ భారత్‌కు వేరే దేశం నుంచి వచ్చిందని.. ఇక్కడ పుట్టలేదని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపణ వ్యక్తం చేసింది.
ALSO READ: సెకెండ్ వేవ్‌కు చెక్ వ్యాక్సినేషనే.. కానీ ఉత్పత్తి అంఛనాలు చూస్తే ఏనాటికి సాధ్యం?
ALSO READ: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య భీకర పోరు షురూ!