MIDDLE-EAST WAR: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య భీకర పోరు షురూ!

ప్రపంచం ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)లో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. చిరకాలంగా శతృత్వాన్ని పెంచుకుంటూ వస్తున్న ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య భీకర పోరుకు తెరలేచింది. ఓ ప్రార్థనా స్థలంపై...

MIDDLE-EAST WAR: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య భీకర పోరు షురూ!
Israel Palasteen Attacks Uno Logo 2
Follow us
Rajesh Sharma

|

Updated on: May 14, 2021 | 10:15 AM

MIDDLE-EAST WAR BETWEEN ISRAEL PALESTINE: ప్రపంచం ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)లో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. చిరకాలంగా శతృత్వాన్ని పెంచుకుంటూ వస్తున్న ఇజ్రాయిల్ (ISREAL), పాలస్తీనా (PALESTINE) మధ్య భీకర పోరుకు తెరలేచింది. ఓ ప్రార్థనా స్థలంపై అజమాయిషీ కోసం మూడు మతాల వారు కుమ్ములాడుకుంటున్న తరుణంలో ఇజ్రాయిల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. దీనికి ధీటుగా పాలస్తీనా మిలిటెంట్లు (MILITANTS) ఎదురు దాడికి దిగుతున్నారు. దాంతో మూడు మతాల వారు పవిత్రంగా భావించే జెరూసలేం (JERUSALEM) వార్ సెంట్రిక్ ఏరియాగా మారిపోయింది.

దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్‌– పాలస్తీనా మధ్య భీకర పోరు మొదలైంది. పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్ (HAMAS), ఇతర ఉగ్రవాద సంస్థల అధీనంలోని గాజా సిటీ (GAZA CITY) నుంచి పాలస్తీనా మీదకు, పాలస్తీనా నుంచి గాజా సిటీ వైపునకు లెక్కకు మించిన రాకెట్లు, వైమానిక బాంబర్లు దూసుకొస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని రెండు అపార్ట్‌మెంట్లు కుప్పకూలాయి. సెంట్రల్‌ గాజాలోని అత్యంత ఎత్తయిన భవంతుల్లో చాలా వాటిని ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. దీంతో గాజాలో మే 10వ తేదీ నుంచి ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48కి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రాణాలు కోల్పోయిన వారిలో 14 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. గాజాలో ఓ కారుపై మిసైల్ పడటంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. మొత్తంగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా రాకెట్లతో దాడులు చేస్తామని హమాస్‌ కమాండర్లు ప్రకటించిన వీడియో దృశ్యాలను ఇజ్రాయెల్‌ టీవీ చానళ్లు లైవ్ టెలికాస్ట్ చేశాయి. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ మెట్రో ప్రాంతంపై ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. హమాస్‌ ఉగ్రవాదులు యుద్ధ ట్యాంక్‌ విధ్వంసక క్షిపణిని సరిహద్దులో ప్రయోగించగా ఒక ఇజ్రాయెల్‌ దేశస్తుడు మరణించాడు. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. మరణించిన వారు పౌరులా? సైనికులా? అనేది తెలియాల్సి ఉంది.

ఉగ్రవాదులు జరిపిన వేర్వేరు దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్‌ దేశస్తులు, ఒక సైనికుడు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారు. ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఉగ్రవాదులు మా దేశం మీదకు ఏకంగా 1,050 రాకెట్లతో దాడులు చేశారని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. వీటిలో 200 రాకెట్లు గురితప్పి వాళ్ల అధీనంలోని గాజా సిటీలోనే పడిపోయాయని సైన్యం పేర్కొంది. గాజా నుంచి తమ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను నేలకూల్చామని సైన్యం తెలిపింది. సరిహద్దున ఉన్న ఇజ్రాయెల్‌ నగరం టెల్‌ అవీవ్‌ (TEL AVIV) సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని సైన్యం పేర్కొంది. ఉద్రిక్తతలు మరింత పెరిగి.. యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి (UNITED NATIONS ORGANISATION) భద్రతా మండలి (SECURITY COUNCIL) నిర్ణయించింది.

ఇజ్రాయెల్‌ దాడుల్లో పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు చెందిన గాజా సిటీ కమాండర్‌ బసీమ్‌ ఇసా సహా ఇంకొందరు ఉగ్రవాదులు మరణించారు. గాజాలో గత ఏడేళ్లలో సిటీ కమాండర్‌ స్థాయి ఉగ్రవాది మరణించడం ఇదే తొలిసారి. కాగా, పరస్పర రాకెట్ల దాడులపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ మాట్లాడారు. ఇజ్రాయల్ వైపు ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తే ధీటుగా స్పందిస్తామని.. ఊహించని దాడులకు పాల్పడతామని ఆయన హెచ్చరించారు.

పవిత్రస్థలం కోసమే తాజా దాడులు?

చినికిచినికి గాలివాన మారిన విధంగా ప్రస్తుతం ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య కొనసాగుతున్న రాకెట్ల దాడులు.. ఇకపై యుద్దంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ గొడవకు కారణమేంటి? ఈ విషయం ఇపుడు ఆసక్తి రేపుతోంది. జెరూసలెం లోని అల్-ఖల్సా మసీదు ప్రాంగణమే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితంద పాలస్తీనా, ఇజ్రాయిల్ భద్రతా దళాల మధ్య ఈ పవిత్ర స్థలం దగ్గర ఘర్షణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు, క్రిస్టియన్లు, యూదులు అత్యంత పవత్రంగా భావించే పాత జెరూసలెంలో ఈ అల్-ఖల్సా మసీదు వుంటుంది. మూడు మతాల వారు దీనిని తమ పవిత్ర స్థలంగా భావిస్తారు. కాబట్టే యునెస్కో దీనికి ప్రత్యేక భద్రత కల్పించింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

అల్-అఖ్సా మాస్క్ ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటి. సుమారు 35 ఎకరాల భూమిలో నిర్మాణమైన అల్-అఖ్సా ప్రాంగణాన్ని ముస్లింలు హరామ్ అల్-షరీఫ్‌గా పిలుచుకుంటారు. యూదులు దీనిని టెంపుల్ ఆఫ్ మౌంట్‌గా భావిస్తారు. ముస్లింల విశ్వాసం ప్రకారం మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఇక్కడికి ఓ రాత్రి వచ్చి.. ప్రార్థనలు జరిపిన తర్వాత అవతార సమాప్తి చేశాడని ముస్లింలు భావిస్తారు. ఇక్కడ భారీ మసీదును ఎనిమిదో శతాబ్ధంలో నిర్మించారు. ఇక్కడ ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు నిర్మించుకునే వీలుంది. సెలవు రోజుల్లో భారీ సంఖ్యలో ముస్లింలు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరుపుకుంటారు. మసీదుపై గోల్డ్ కోటింగ్‌తో వున్న కప్పు ఈ మసీదును ప్రత్యేకంగా నిలబెడుతుంది.

ఇక యూదులు దీనిని టెంపుల్ మౌంట్‌ పేరిట ప్రత్యేక పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇక్కడ ఒకప్పుడు కొండ వుండేదని, దానిపై రెండు యూదు దేవాలయాలుండేవని చెప్పుకుంటారు. ఇందులో ఒకదానిని కింగ్ సాల్మన్ నిర్మించారని, దీని ప్రస్తావన బైబిల్‌లోను వుందని చెబుతారు. అయితే దీనిని బాబిలోనియన్లు కూల్చేశారని చరిత్ర చెబుతోంది. ఇక రెండోది 600 ఏళ్ళ క్రితం నిర్మాణమైంది. రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైందని చరిత్రలో పేర్కొన్నారు. అయితే ఈ రెండు దేవాలయాలను మెస్సయ్య మళ్ళీ భూమ్మీదకు తిరిగి వచ్చి నిర్మిస్తాడని యూదులు విశ్వసిస్తారు.

తాజాగా ముస్లిమేతరులను ఈ అల్-అఖ్సా మసీదు ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతించడంలో వివక్ష చూపిస్తున్నారంటూ గొడవ మొదలైంది. ఇటీవల నిర్వహించిన జెరూసలెం డే పేరిట జరిపిన ఉత్సవాలు తాజా యుద్ధవాతావరణానికి ఆజ్యం పోసినట్లు భావిస్తున్నారు. జెరూసలెం టౌనును స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ అధికారికంగా జెరూసలెం డేను నిర్వహించింది. ఈ ఉత్సవాలు పాలస్తీనా ఉగ్రవాదులను రెచ్చగొట్టాయి. దాంతో ఇజ్రాయిల్ లక్ష్యంగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ దాడులు ప్రారంభించింది. దీనికి ధీటుగా ఇజ్రాయిల్ దాడులకు దిగడంతోపాటు.. వాటిని వైమానిక దాడులుగా మార్చడంతో ఇపుడు పూర్తిగా యుద్ధ వాతావరణంలోకి ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రాంతం మారిపోయింది. తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్య రాజ్య సమితి.. ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి.. పరిస్థితిని సమీక్షించేందుకు రెడీ అవుతోంది.

ALSO READ: ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ.. ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ఓ రెడీ.. కానీ మీనమేషాలెందుకంటే?

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!