AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Stalin letter: కోవిడ్ మందులు, వ్యాక్సిన్ కొనుగోళ్లపై జీఎస్టీ మినహాయించండి.. ప్రధానికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ

కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ పన్నును పూర్తిగా రద్దు చేయాలని, జీఎస్‌టీ పరిహారం, బియ్యం రాయితీని వెంటనే చెల్లించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

CM Stalin letter: కోవిడ్ మందులు, వ్యాక్సిన్ కొనుగోళ్లపై జీఎస్టీ మినహాయించండి.. ప్రధానికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
Tamilnadu Cm Mk Stalin Letter
Balaraju Goud
|

Updated on: May 13, 2021 | 3:24 PM

Share

CM Stalin letter to PM Modi: కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ పన్నును పూర్తిగా రద్దు చేయాలని, జీఎస్‌టీ పరిహారం, బియ్యం రాయితీని వెంటనే చెల్లించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

అన్ని రాష్ట్రాలు కరోనా మహమ్మారి బారిన పడుతూ ఇబ్బందులు ఎదర్కొంటున్నారని, వైరస్‌ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు టీకాలు, మందులను స్వయంగా సేకరిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ కౌన్సిల్‌తో సంప్రదించి ఈ అంశాలపై జీఎస్టీ పెంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత కాలానికి సున్నా రేటుకు పన్నును నిర్ణయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ భారత ప్రధానమంత్రిని కోరారు.కొవిడ్‌పై పోరులో ఉపయోగిస్తున్న వైద్యపరికరాలు, ఔషధాలపై అన్ని రకాల పన్నులు, కస్టమ్స్‌ సుంకాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. కోవిడ్‌ సంబంధిత మందులు, ఆక్సిజన్‌ కాన్సనేట్రటర్లు, సిలిండర్లు, కంటెయినర్లు విరాళంగా ఇస్తామని అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారని.. వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు.

తమిళనాడు రాష్ట్రం లో కరోనా పాజిటివ్ కేసులు రోజు, రోజుకి పెరగడంతో కరోనా వ్యాక్సిన్, మెడిసిన్ లకు భారీగా కొరత ఏర్పడుతోంది. మరోవైపు, కరోనా బాధితులకు మెరుగయిన వైద్య సేవల తక్షణమే అందించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారంగా మారింది . ఈ క్రమంలో కేంద్రం తక్షణమే కరోనా వ్యాక్సిన్ లతో పాటు కరోనా నివారణకు ఉపయోగిస్తున్న మెడిసిన్ లపై జీఎస్టీ టాక్స్ ని తక్షణమే రద్దు చేయాలనీ ప్రధానికి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విపత్కర పరిస్థితులలో ఆదాయవనరులను కోల్పోతున్నాయని, కేంద్రం దీనిపై తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వాలకు అందవలసిన జీఎస్టీ బకాయిలను చెల్లించాలని ప్రధానిని కోరారు.

అలాగే, పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ. పరిహారం మొత్తాలు, రాష్ట్ర వినియోగదారుల వస్తువుల సంస్థలకు చెల్లించాల్సిన బియ్యం రాయితీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. పెట్రోల్, డీజిల్‌పై సర్‌చార్జి కారణంగా కేంద్ర ప్రభుత్వం అందుకున్న ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారికి రాష్ట్ర ప్రభుత్వాలకు పరిహారం చెల్లించడానికి అధోక్ గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ అందించాలని స్టాలిన్ కోరారు. అంతేకాదు ప్రస్తుత సమయంలో అదనపు ఖర్చులను భరించటానికి అవసరమైన నిధులను సేకరించడానికి, అనుమతించబడిన రుణాలు రాష్ట్ర జీడీపీలో మూడు శాతం నుండి ఒక శాతం పెంచాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇదిలావుంటే, గతంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేంద్రానికి లేఖ రాశారు. కరోనా పోరులో ఉపయోగిస్తున్న వైద్యపరికరాలు, ఔషధాలపై అన్ని రకాల పన్నులు, కస్టమ్స్‌ సుంకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖలో పేర్కొన్నారు. ఆమె లేఖపై ఆర్ధిక మంత్రి స్పందించారు. కొవిడ్‌ ఔషధాలకు జీఎస్టీ మినహాయింపు సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఆ విధంగా చేస్తే ఆ మందులు వినియోగదారులకు మరింత ప్రియం అవుతాయని ఆమె హెచ్చరించారు.

Read Also….  COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. లాటరీ ఫ్రీ.. మిలియన్ డాలర్ల బహుమానం.. ఎక్కడంటే?