కరోనా కారణంగా కంపెనీ ఉద్యోగి మరణిస్తే.. వారి కుటుంబాలకు రెండేళ్ల వరకు వేతనాలు.. ఆ కంపెనీ ప్ర‌క‌ట‌న‌

కోవిడ్ 19 కారణంగా ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది రోడ్డున పడుతున్నారు. కరోనా కష్టకాలం జీవితాలలో విషాదాన్ని నింపుతోంది. అయితే ఒక కంపెనీ ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు కల్పిస్తోంది.

కరోనా కారణంగా కంపెనీ ఉద్యోగి మరణిస్తే.. వారి కుటుంబాలకు రెండేళ్ల వరకు వేతనాలు.. ఆ కంపెనీ ప్ర‌క‌ట‌న‌
Corona Deaths
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2021 | 3:06 PM

Coronavirus: కోవిడ్ 19 కారణంగా ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది రోడ్డున పడుతున్నారు. కరోనా కష్టకాలం జీవితాలలో విషాదాన్ని నింపుతోంది. అయితే ఒక కంపెనీ ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు కల్పిస్తోంది. కరోనాతో చనిపోతే ఉద్యోగుల కుటుంబాలకు రెండేళ్లపాటు జీతాలు చెల్లించనుంది.  కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. నానాటికీ కేసులు పెరిగిపోతూనే వస్తున్నాయి. దీంతో కంపెనీలు కూడా వాటి ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా బజాజ్ ఆటో కూడా ఈ జాబితాలోకి చేరింది. ఉద్యోగుల కుటుంబాలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా కంపెనీ ఉద్యోగి మరణిస్తే.. వారి కుటుంబాలకు రెండేళ్ల వరకు వేతనాలు చెల్లిస్తామని బజాజ్ ఆటో ప్రకటించింది. అంతేకాకుండా పిల్లల చదువు బాధ్యత కూడా కంపెనీయే చూసుకోనుంది. ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్‌ కాలాన్ని ఐదేళ్లకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

24 నెలల పాటు రూ.2 లక్షల వరకు వేతనాలు చెల్లిస్తామని కంపెనీ లింక్డ్ ఇన్‌ పోస్ట్‌లో తెలిపింది. 12వ తరగతి వరకు ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది. అలాగే గ్రాడ్యుయేషన్ చదివే వారికి ఏడాదికి రూ.5 లక్షలు అందిస్తామని తెలిపింది. పర్మనెంట్ ఉద్యోగులు అందరికీ 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ బెనిఫిట్ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

క‌రోనా తెలంగాణ లాక్ డౌన్ వివ‌రాలు దిగువ‌న చూడండి…

Also Read: 2000 రూపాయల నోటు బ్యాన్ అయిందా..? ఏటీఎంలలో కూడా కనిపించడం లేదు.. ఎందుకో తెలుసా..?

 33 మందికి క‌రోనా అంటించిన మహిళ .. ఏం జ‌రిగిందంటే…!