మీకు ఆక్సిజన్ కావాలా ? ఇస్తాం ! ఇతర రాష్ట్రాలకు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సూచన, వ్యాక్సిన్ మాత్రం లేదని ఆవేదన
తమ రాష్ట్రంలో ఆక్సిజన్ కి డిమాండ్ బాగా తగ్గిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా తెలిపారు. మిగులు ప్రాణవాయువు చాలా ఉందని, అవసరమైన రాష్ట్రాలకు దీన్ని ఇస్తామని ఆయన చెప్పారు...
తమ రాష్ట్రంలో ఆక్సిజన్ కి డిమాండ్ బాగా తగ్గిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా తెలిపారు. మిగులు ప్రాణవాయువు చాలా ఉందని, అవసరమైన రాష్ట్రాలకు దీన్ని ఇస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు చాలావరకు తగ్గాయి. ఇప్పుడు ఆసుపత్రి బెడ్స్ కి కూడా కొరత లేదు అని ఆయన చెప్పారు. 15 రోజుల క్రితం నగరానికి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా ప్రస్తుతానికి అది 582 మెట్రిక్ టన్నులకు తగ్గినట్టు ఆయన చెప్పారు. అందువల్ల మా కోటాలో కొంత ప్రాణవాయువును అవసరమైన రాష్ట్రాలకు ఇవ్వాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. తమకు ఈ విషయంలో సహకరించిన కేంద్రానికి, ఢిల్లీహైకోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అటు ఢిల్లీలో తాజాగా 10,400 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇది 21 శాతం తక్కువ. పాజిటివిటీ రేటు 17 శాతం నుంచి 14 శాతానికి తగ్గింది.
ఇక దేశంలో మళ్ళీ వ్యాక్సిన్ కొరతను గురించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ఒకదాని తరువాత ఈ దేశాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయని అన్నారు. ఇన్నాళ్లూ ఆక్సిజన్ కొరతతో అల్లాడితే ఇప్పుడు వ్యాక్సిన్ కొరత తీవ్రమైందన్నారు., అంతర్జాతీయంగా మన భారతీయ రాష్ట్రాలు ఒకదానికొకటి పోటీ పడడమో , కొట్లాడుకోవడమో జరుగుతోందని వ్యంగ్యంగా పేర్కొన్నారు. మహారాష్ట్ర ఢిల్లీ తోను, కర్ణాటక ఒరిస్సాతోను ఇలా రాష్ట్రాలు పరస్పరం కలహించుకునే స్థితికి వచ్చాయన్నారు.. నిన్న మొన్నటివరకు ఆక్సిజన్ కోసం కేంద్రం ముందు చేతులు చాచామని, ఇప్పుడు వ్యాక్సిన్ కోసం మోకరిల్లాల్సి వస్తోందని కేజ్రీవాల్ అన్నార
మరిన్ని ఇక్కడ చూడండి: Karimnagar district news: బుడ్డోడా ఇదేం పనిరా..? తల్లిదండ్రుల హైరానా.. చివరకు
నల్ల ఎండు ద్రాక్షతో అద్భుత ఫలితాలు..! రక్తహీనత, ఎముకల వ్యాధికి చక్కటి పరిష్కారం..