Free Covid treatment : షాపూర్ నగర్ మల్లారెడ్డి కొవిడ్‌ కేర్‌ సెంటర్లో ఉచిత వైద్య, ఆహార, మందుల సేవలు

Mallareddy covid care center : తెలంగాణలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన రోగులకు వ్యక్తులు, సంస్థలు స్వచ్చందంగా ముందుకొచ్చి ఉచితంగా అనేక రకాల సేవలు అందిస్తున్నారు..

Free Covid treatment : షాపూర్ నగర్ మల్లారెడ్డి కొవిడ్‌ కేర్‌ సెంటర్లో ఉచిత వైద్య, ఆహార, మందుల సేవలు
Malla Reddy Covid Care Free
Follow us
Venkata Narayana

|

Updated on: May 13, 2021 | 3:13 PM

Mallareddy covid care center : తెలంగాణలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన రోగులకు వ్యక్తులు, సంస్థలు స్వచ్చందంగా ముందుకొచ్చి ఉచితంగా అనేక రకాల సేవలు అందిస్తున్నారు. కరోనా రోగులకు స్వాంతన చేకూర్చడంలో తమ వంతు మానవత్వాన్ని చాటుతున్నారు. తాజాగా హైదరాబాద్ షాపూర్‌నగర్‌ లోని మల్లారెడ్డి ఆస్పత్రి వారి సౌజన్యంతో మల్లారెడ్డి కొవిడ్‌ కేర్‌లో ఉచిత వైద్య సేవలు ప్రారంభించారు. కొవిడ్ 19 స్వల్ప లక్షణాలు కలిగి పాజిటివ్‌ వచ్చిన 15 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్లు ఇక్కడ వైద్య సేవలు ఫ్రీగా పొందొచ్చు. 24 గంటలూ డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉండటంతోపాటు ఉచితంగా మందులు, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ఉచితంగా అందిస్తున్నారు. అయితే, ఇక్కడి కొవిడ్ కేర్ సెంటర్లో చేరాలంటే ఐసీఎంఆర్‌ ఆమోదిత ల్యాబ్‌ అందించే కొవిడ్‌ టెస్ట్‌ పాజిటివ్ రిపోర్ట్‌ ఉండాలి. ఆస్పత్రిలో చేరేందుకు మల్లారెడ్డి కొవిడ్ కేర్ సెంటర్ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయాలనీ, ఆధార్‌, ఓటర్‌ ఐడీ గుర్తింపు కార్డులు తప్పనిసరనీ నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెంటర్లోకి ప్రవేశం ఉంటుంది. ఈ సౌకర్యాన్ని కొవిడ్ రోగులు వినియోగించుకోవాలని సదరు సంస్థ పేర్కొంది.

Read also : Land registrations : తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలకు తాత్కాలిక బ్రేక్