CP Sajjanar: అతనే ప్రధాన సూత్రధారి.. కూకట్‌పల్లి ఏటీఎం దోపిడి కేసులో ఇద్దరు అరెస్ట్: సీపీ సజ్జనార్
Kukatpally HDFC ATM Case: హైదరాబాద్ కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఏం దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్
Kukatpally HDFC ATM Case: హైదరాబాద్ కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఏం దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 29న ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి రూ. 5 లక్షల నగదుతో ఉడాయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు బీహార్ వాసులైన అజిత్ కుమార్, ముఖేష్ కుమార్ అని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇద్దరు నిందితుల నుంచి రూ. 6.31 లక్షలు, మూడు సెల్‌ఫోన్లు, నాటు తుపాకీతో పాటు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఏటీఎం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు అజిత్ కుమార్ అని సీపీ పేర్కొన్నారు. అజిత్ కుమార్ ఉపాధి నిమిత్తం 2011లో దుండిగల్‌కు వచ్చాడు. తొలుత కార్మికుడిగా, ఆ తర్వాత కాంట్రాక్టర్‌గా పని చేశాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిపై దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడని వెల్లడించారు.
ఈ క్రమంలో 2018లో దుండిగల్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ కార్యాలయంలో దోపిడీకి యత్నించి విఫలమయ్యాడు. పారిపోయే ప్రయత్నంలో పట్టుబడి అజిత్ జైలు పాలయ్యాడు. జైలు నుంచి వచ్చాక బీహార్ వెళ్లి.. రెండేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాడు. గండి మైసమ్మ వద్ద ఓ ప్యాకేజింగ్ పరిశ్రమలో చేరాడు. అనంతరం స్నేహితుడు ముకేశ్ సాయంతో మళ్లీ నేరాలు కుట్ర పన్నాడని వివరించారు. ఈ క్రమంలో తుపాకీ కొనేందుకు ముకేశ్‌కు అజిత్ రూ. 30 వేలు పంపాడు. తుపాకీ, తూటాలు సమకూర్చిన ముకేశ్ సాయంతో అజిత్ దోపిడీలు చేశాడు. వీరిద్దరూ కలిసి ఏప్రిల్ 16న మనీ ట్రాన్స్‌ఫర్ కార్యాలయంలో రూ. 1.15 లక్షలు దోపిడీ చేశారు. ఏప్రిల్ 24న దుండిగల్‌లో బైక్ చోరీకి పాల్పడ్డారు. ఆ తర్వాత ఏప్రిల్ 29న కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం వద్ద చోరీకి పాల్పడినట్లు సజ్జనార్ తెలిపారు.
Also Read: