Road Accident: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

Road Accident in AP: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన

Road Accident: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 13, 2021 | 7:35 AM

Road Accident in AP: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం ఏడీబీలో జరిగింది. కారును లారీ గురువారం ఉదయం ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అతివేగం వల్లనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.

Also Read:

Gang Rape: బీచ్‌లో సరదా గడిపేందుకు వచ్చిన జంట.. స్నేహితుడిని బంధించి యువతిపై సామూహిక అఘాయిత్యం..!

Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు.. గురువారం రాశి ఫలాలు..