AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gang Rape: బీచ్‌లో సరదాగా గడిపేందుకు వచ్చిన జంట.. స్నేహితుడిని బంధించి యువతిపై సామూహిక అఘాయిత్యం..!

సరదా గడిపేందుకు బీచ్‌కు వచ్చిన యువతిపై ముగ్గురు దుర్మార్గులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేకాదు, ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్ మెయిల్ పాల్పడుతుండటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Gang Rape: బీచ్‌లో సరదాగా గడిపేందుకు వచ్చిన జంట.. స్నేహితుడిని బంధించి యువతిపై సామూహిక అఘాయిత్యం..!
Gang Raped
Balaraju Goud
|

Updated on: May 13, 2021 | 7:33 AM

Share

Gang Raped: ఆంధ్రప్రదేశ్‌లో కామాంధులు రెచ్చిపోయారు. సరదా గడిపేందుకు బీచ్‌కు వచ్చిన యువతిపై ముగ్గురు దుర్మార్గులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేకాదు, ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్ మెయిల్ పాల్పడుతుండటంతో విషయం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వచ్చింది. ఆమెపై కన్నేసిన మద్యం మత్తులో ముగ్గురు కీచకులు సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు.

ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(21) 15 రోజుల కిందట అల్లవరంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. ఆ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లింది. మద్యం తాగి అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు, సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి వారి వద్దకు వచ్చి.. స్నేహితుడిని బంధించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత నగ్నంగా ఉండగా యువతి ఫొటోలు తీశారు. అక్కడి నుంచి తప్పించుకున్న జంట ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

ఇదిలావుంటే, పది రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి యువతి సెల్‌ఫోన్ సేకరించి కాల్ చేయడం మొదలు పెట్టాడు. మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు బంధువులకు జరిగిన అసలు విషయం చెప్పడంతో వారు బుధవారం అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…  క్రెడిట్ కార్డుతో ఇబ్బందులు పడుతున్నారా ? మీ కార్డ్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?
టాలీవుడ్​లో కొత్త హీరోయిన్ల హవా.. త్రిప్తీ నుంచి రషా తడాని వరకు!
టాలీవుడ్​లో కొత్త హీరోయిన్ల హవా.. త్రిప్తీ నుంచి రషా తడాని వరకు!