క్రెడిట్ కార్డుతో ఇబ్బందులు పడుతున్నారా ? మీ కార్డ్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

Credit Card: ప్రస్తుతం చాలా మంది క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. ఎందుకంటే అవసరానికి ముందుగానే డబ్బు మన కార్డు ద్వారా ఖర్చు చేసుకోవడం..

క్రెడిట్ కార్డుతో ఇబ్బందులు పడుతున్నారా ? మీ కార్డ్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
Credit Card
Follow us

|

Updated on: May 13, 2021 | 7:28 AM

Credit Card: ప్రస్తుతం చాలా మంది క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. ఎందుకంటే అవసరానికి ముందుగానే డబ్బు మన కార్డు ద్వారా ఖర్చు చేసుకోవడం.. ఆ తర్వాత నగదు చెల్లించడం. ఈ ప్రాసెస్‏తోనే ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్స్ ఉపయోగిస్తుంటారు. అయితే దీని వలన లాభాలు ఉన్న మాట పక్కన పెడితే కొన్ని సార్లు ఈ కార్డ్ వలన మానసిక ఒత్తిడికి గురవుతుంటాం. సమయానికి డబ్బు కట్టలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక కొంత మంది క్రెడిట్ కార్డ్ ఇంకా మేము ఉపయోగించలేము. వెంటనే క్లోజ్ చేయాలనుకుంటారు. కానీ క్రెడిట్ కార్డ్ ఎలా క్లోజ్ చేయాలి.. అందుకు సంబంధించిన ప్రాసెస్ ఎంటీ అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు. మరీ మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా. Credit Card Closed Process

క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకోవడానికి ముందు మీరు క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉండకూడదు. అలాగే మీ కార్డ్ వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత క్రెడిట్ కార్డు క్లోజ్ చేసుకోవచ్చు. మీరు మీ క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలని భావిస్తే.. ముందుగా మీరు బ్యాంకుకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మీరు ఆన్‌లైన్‌లో బ్యాంక్‌కు ఈమెయిల్ పంపడం ద్వారా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత బ్యాంక్ మీకు ఔట్ స్టాండింగ్ డబ్బులు కట్టడానికి ఒక లింక్ పంపిస్తుంది. అప్పుడు మీరు కార్డుపై ఉన్న మొత్తం బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ క్రెడిట్ కార్డ్ క్లోజ్ రిక్వెస్ట్ బ్యాంక్ ప్రాసెస్ చేస్తుంది. బ్యాంక్ మీ కార్డును క్లోజ్ చేసేంత వరకు మీరు వెయిట్ చేయాలి. మరీ తొందర అనుకుంటే అప్పుడప్పుడు బ్యాంక్‏తో టచ్ లో ఉండాలి. మీ కార్డ్ క్లోజ్ వర్క్ ఎంతవరకు వచ్చింది అనే విషయం తెలుసుకోవాలి. మీకు మీ కార్డు క్లోజ్ అయినట్లుగా కన్ఫర్మేషన్ వస్తుంది. కొన్ని నెలల తర్వాత సిబల్ హిస్టరీ చెక్ చేసుకోవాలి. అప్పుడు మీ కార్డు వివరాలు అందులో ఉండవు. ఒకవేళ ఉంటే గనుక మీ కార్డు ఇంకా క్లోజ్ కాలేదన్నట్లు అర్థం. అప్పుడు మళ్లీ ఒకసారి బ్యాంక్ ను అప్రోచ్ అవ్వాలి.

Also Read: వినియోగదారులకు అలర్ట్.. మరో ట్విస్ట్ ఇచ్చిన వాట్సప్.. ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఆ సర్వీసులు పొందలేరు..

EPF Withdrawal: వివిధ రకాల అవసరాల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చంటే..!