EPF Withdrawal: వివిధ రకాల అవసరాల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చంటే..!

EPF Withdrawal: కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. గత సంవత్సరం వైరస్‌ ఆర్థిక సంక్షోభం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా అలాంటి ఆర్థిక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది..

EPF Withdrawal: వివిధ రకాల అవసరాల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: May 13, 2021 | 6:07 AM

EPF Withdrawal: కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. గత సంవత్సరం వైరస్‌ ఆర్థిక సంక్షోభం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా అలాంటి ఆర్థిక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకునేవి ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPF) అకౌంట్‌లోని డబ్బులే. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చిన సమయంలో పీఎఫ్‌ డబ్బుల వైపే చూస్తుంటారు. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ కూడా ఈ పీఎప్‌ ఖాతాదారులకు పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. కరోనా సంక్షోభంలోనే కాదు వివాహాలు, పిల్లల చదువులు, స్థిరాస్తి కొనుగోలు, హోమ్‌ లోన్ రీపేమెంట్‌, వైద్య అవసరాలు ఇలా ఎన్నో రకాలుగా ఈపీఎఫ్‌ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. మరి దేనికి ఎంత డబ్బు డ్రా చేసుకోవాలో చూద్దాం.

Covid -19: కరోనా వైరస్‌ కారణంతో ఉద్యోగులు ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ నుంచి తమ మూడు నెలల వేతనం, వేతనం+డీఏ లేదా మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉన్నవారందరికీ ఇది వర్తిస్తుంది.

పెళ్లి: ఈపీఎఫ్‌ అకౌంట్‌దారులు తమ పెళ్లికి లేదా సోదరి, సోదరుడు, కూతురు, కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కోసం ఈపీఎఫ్‌ అకౌంట్‌లో ఎంప్లాయీస్‌ షేర్‌ నుంచి 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. 7 ఏళ్ల సర్వీస్‌ ఉన్నవారికి ఈ అవకాశం ఉంటుంది.

చదువు: ఈపీఎఫ్‌ అకౌంట్‌దారుడు తమ చదువులు, లేదా పిల్లల పై చదువుల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్‌లో ఎంప్లాయీస్‌ షేర్‌ నుంచి 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏడేళ్ల సర్వీసు ఉన్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.

ల్యాండ్‌లోన్‌: ఈపీఎఫ్‌ అకౌంట్‌ హోల్టర్‌ భూమి కొనుగోలు చేయాలనుకుంటే తమ వేతనం + డీఏకు 24 రెట్లు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్థలం తన పేరు మీద లేదా జీవిత భాగస్వామి పేరు మీద జాయింట్‌గా ఉండాలి. ఇక ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే 36 రెట్లు విత్‌డ్రా చేయవచ్చు. ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఇది వర్తిస్తుంది. మొత్తం సర్వీస్‌లో ఈ కారణంతో ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

హోమ్‌ లోన్‌ రీపేమెంట్‌: ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఎంప్లాయీస్‌, ఎంప్లాయర్‌ కంట్రిబ్యూషన్‌ మొత్తం 90 శాతం వరకు విత్‌డ్రా చేయవచ్చు. మూడేళ్ల సర్వీస్‌ పూర్తయినవారికి ఈ అవకాశం ఉంటుంది. అయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ ఈపీఎఫ్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

రిటైర్డ్‌మెంటుకు ముందు: ఈపీఎఫ్‌ అకౌంట్‌దారుడు 57 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఈపీఎఫ్‌ ఖాతాలోని మొత్తం 90 శాతం వరకు వడ్డీతో సహా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

వైద్యం: ఈపీఎఫ్‌ ఖాతాదారులు తమకు లేదా జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల వైద్య అవసరాల కోసం ఎంప్లాయీస్‌ షేర్‌ వడ్డీతో కలిపి లేదా తమ ఆరు నెలల వేతనాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. వీటిలో ఏది తక్కువైతే అది మాత్రమే వర్తిస్తుంది. సర్వీసు నిబంధనలు అంటూ ఏమీ ఉండవు.

రిటైర్‌మెంట్‌: ఒక వేళ ఈపీఎఫ్‌ ఖాతాదారుడు వయసు 58 ఏళ్లు దాటినట్లయితే అప్పటి వరకు ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Cooking Oil Price: సామాన్య ప్రజలకు తీపి కబురు.. దిగి రానున్న వంట నూనె ధరలు..! నివేదికలు ఏం చెబుతున్నాయి

Car Loan: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? తక్కువ వడ్డీతో కారు లోన్లు అందిస్తున్న బ్యాంకులు ఇవే..!

చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు