AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌తో పాటు ఐదు ప్రధాన నగరాల్లో మరింతగా గిడ్డంగుల విస్తరణ

Flipkart: ఈ-కామర్స్‌ మార్కెటింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ హైదరాబాద్‌లో తమ గిడ్డంగిని మరింత విస్తరించనుంది. రాబోయే మూడు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా గిడ్డంగుల సామర్థ్యాన్ని..

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌తో పాటు ఐదు ప్రధాన నగరాల్లో మరింతగా గిడ్డంగుల విస్తరణ
Flipkart
Subhash Goud
|

Updated on: May 13, 2021 | 6:10 AM

Share

Flipkart: ఈ-కామర్స్‌ మార్కెటింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ హైదరాబాద్‌లో తమ గిడ్డంగిని మరింత విస్తరించనుంది. రాబోయే మూడు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా గిడ్డంగుల సామర్థ్యాన్ని 8 లక్షల చదరపు అడుగులకుపైగా పెంచాలని ఫ్లిప్‌కార్ట్‌ భావిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ గిడ్డంగిని విస్తరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరు, కోల్‌కతా నగరాల్లోని ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్ల సామర్థ్యాన్ని పెంచనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశ వ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్‌కు 15 గిడ్డంగులుండగా, వీటి నిల్వ సామర్థ్యం 25 లక్షల క్యూబిక్‌ ఫీట్లు.

అయితే రోజురోజుకు తన ఆన్‌లైన్‌ మార్కెట్‌ను మరింతగా విస్తరింపజేస్తున్న ఫ్లిప్‌కార్ట్‌.. కస్టమర్లకు సేవలందించడంపై ఈ వాల్‌మార్ట్‌ అనుంబంధ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసరాల డిమాండ్‌కు తగినట్లుగా గిడ్డంగులను మరింతగా విస్తరించాలని భావిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అందుకే హైదరాబాద్‌ సహా ఆయా నగరాల్లో అనుంబంధంగా మరో ఐదు కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అదనంగా అందుబాటులోకి తీసుకు వచ్చే స్థలంతో రోజూ 73 వేలకుపైగా గ్రాసరీ ఆర్డర్లకు సర్వీస్‌ ఇవ్వగలమని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడిస్తోంది. ప్రస్తుతం దాదాపు 64వేల ఆర్డర్లనే తీసుకోగలుగుతున్నారు.

కరోనా నేపథ్యంలో..

దేశ వ్యాప్తంగా కరోనా మహహ్మారి మరింత వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కస్టమర్లకు సురక్షితంగా కావాల్సిన వస్తూ ఉత్పత్తులను సరఫరా చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే గడిచిన నెల రోజుల్లో హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లోని గిడ్డంగుల్లో నిత్యావసరాల నిల్వల్ని పెంచింది. అంతేగాక ప్రత్యేకంగా హైదరాబాద్‌, ఢిల్లీ, గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, నోయిడా, పుణె నగరాలకు తమ హైపర్‌లోకల్‌ సర్వీస్‌ ‘ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌’ను విస్తరించింది. అయితే ఈ నగరాల్లో కస్టమర్లకు పండ్లు, కూరగాయలు తదితర నిత్యావసరాలను ఆర్డర్‌ చేసిన 90 నిమిషాల్లోనే అందుతున్నాయి. 200లకుపైగా రకాలైన 7వేలకుపైగా ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్‌ గ్రాసరీ విక్రయిస్తోందని ఈ విభాగం అధికారులు తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Business Idea: కరోనా పరిస్థితుల్లో సరైన వ్యాపారం.. నెలకు రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం..!

Tata Motors: కార్లపై భారీ ఆఫర్‌ ప్రకటించిన టాటా మోటార్స్‌.. 65 వేల రూపాయల వరకు ఆదా..!