- Telugu News Photo Gallery Business photos Tata motors tata harrier nexon tigor and tiago get discounts for may 2021
Tata Motors: కార్లపై భారీ ఆఫర్ ప్రకటించిన టాటా మోటార్స్.. 65 వేల రూపాయల వరకు ఆదా..!
Tata Motors: ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ పలు కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు అందస్తోంది..
Updated on: May 11, 2021 | 6:27 AM

Tata Motors: ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ పలు కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు అందస్తోంది. దాదాపు రూ.6.5 వేల వరకు తగ్గింపు అందిస్తొంది. ఈ తగ్గింపు ఆఫర్ మే నెలాఖరు వరకు అందుబాటులో ఉండనుంది.

టాటా టియాగో, టాటా టిగోర్, టాటా నెక్సన్, టాటా హారియర్ వంటి కార్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. టాటా టియాగో కారుపై రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 10 వేల తగ్గింపు పొందవచ్చు. అలాగే టాటా టిగోర్ మోడల్‌పై రూ. 15 వేల తగ్గింపు ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 15 వేల డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.

అలాగే టాటా నెక్సన్ కారుపై ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 15 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే టాటా హారియర్ కారుపై రూ. 25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 40 వేల వరకు తగ్గింపు ప్రయోజనాన్ని సొంతం చేసుకోవచ్చు.





























