Subhash Goud |
Updated on: May 12, 2021 | 6:20 AM
కరోనా మహమ్మారితో దేశమంతా అతలాకుతలం అవుతోంది. గత ఏడాదిగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో దేశం ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ కరోనా కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు ఎంతో మంది సాయం చేస్తున్నారు.
ఈ కరోనా కష్టకాలంలో ప్రముఖ ఐటీ కంపెనీలు విరాళాలు అందించి సాయపడుతున్నాయి. ఇక ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మరోసారి భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనాపై పోరుకు తమవంతు సాయంగా కర్ణాటక రాష్ట్రానికి రూ.100 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి ప్రకటించారు. గత ఏడాది కరోనా కాలంలో ఇన్ఫోసిస్ రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది.
కాగా.. అప్పట్లో దానిని బెంగళూరు నగరానికే పరిమితం చేశారు. అయితే ఈసారి 100 కోట్ల రూపాయలను ఇతర నగరాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఇతరత్రా ఔషధాల కొనుగోళ్లకు వినియోగించుకోవాలని తెలిపారు.