Business Idea: కరోనా పరిస్థితుల్లో సరైన వ్యాపారం.. నెలకు రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం..!

Business Idea: సమ్మర్‌ రాగానే వాటర్‌ బాటిళ్లకు ఎక్కడ లేని డిమాండ్‌ ఉంటుంది. మన దేశంలో జులై వరకూ వేడి వాతావరణం ఉంటుంది. ఐతే... కరోనా వచ్చాక... వాటర్ బాటిళ్ల వాడకం..

Business Idea: కరోనా పరిస్థితుల్లో సరైన వ్యాపారం.. నెలకు రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం..!
Follow us
Subhash Goud

|

Updated on: May 11, 2021 | 6:13 AM

Business Idea: సమ్మర్‌ రాగానే వాటర్‌ బాటిళ్లకు ఎక్కడ లేని డిమాండ్‌ ఉంటుంది. మన దేశంలో జులై వరకూ వేడి వాతావరణం ఉంటుంది. ఐతే… కరోనా వచ్చాక… వాటర్ బాటిళ్ల వాడకం బాగా పెరిగింది. ప్రజలు… కుండలు, హోటళ్లలో దాదాపు నీరు తాగడం మానేశారు. ఎవరికి వారు వాటర్ బాటిల్స్ కొనుక్కొని ఆ నీరే తాగుతున్నారు. దాంతో… మినరల్ వాటర్ బాటిళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ వాటర్‌ బాటిళ్ల వ్యాపారంలో అధిక లాభాలుంటాయి. సాధారణ ఫిల్టర్ చేసిన నీటిని లీటర్ రూ.20 వరకు ధర ఉంటుంది. 20 లీటర్ల వాటర్ కేన్లకు కూడా డిమాండ్ భారీగానే ఉంది. అందువల్ల ఇలాంటి వ్యాపారం ప్రారంభించిన వారికి చాలా లాభాలు గడిస్తున్నారు. కొత్తగా ఏదైనా వ్యాపారం చెయ్యాలి అనుకునేవారికి ఇది మంచి వ్యాపారమనే చెప్పాలి.

మీరు కంపెనీ ప్రారంభించాలనుకుంటే కంపెనీ చట్ట ప్రకారం మీ కంపెనీ పేరును రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ పేరు కూడా సింపుల్‌గా, జనాల్లో బాగా గుర్తుండిపోయేలా ఉండాలి. కంపెనీ పేరు రిజిస్టర్ అయ్యాక… మీరు పాన్, జీఎస్టీ వివరాలు సమర్పించాలి. ఇతర పనులన్ని పూర్తయ్యాక.. మీరు వాటర్ ప్లాంట్ కోసం స్థలం కేటాయించుకోవాలి. మీకు 1000 నుంచి 1500 చదరవు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది. ఇందులోనే బోర్ వేసుకోవాలి. అలాగే… RO, చిల్లర్ మెషిన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ స్టోర్ చేసుకోవడానికి ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంత సమయం పట్టే పనే. కానీ సమయం తీసుకున్న మంచి లాభాలు వచ్చే వ్యాపారమే.

లైసెన్స్, ఐఎస్‌ఐ నెంబర్‌:

మీరు వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభించడానికి లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. అలాగే వాటర్‌ బాటిళ్లపై ముద్రించేందుకు ఐఎస్ఐ (ISI) ప్రమాణం తప్పకుండా పొందాల్సి ఉంటుంది. మీరు ప్లాంట్ ప్రారంభించే చోట… నీటిలో TDS లెవెల్ ఎక్కువగా ఉండకూడదు. చాలా కంపెనీలు కమర్షియల్ RO ప్లాంట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ప్లాంట్ ధర రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఇది మీరు కొనుక్కోవచ్చు. అలాగే మీరు 100 వాటర్ సరఫరాపై కేన్లను కొనుక్కోవాలి. వీటిలో 20 లీటర్లు పట్టేవి ఉంటే మంచిది. ఈ మొత్తానికీ మీకు 4 నుంచి 5 లక్షలు అవసరం.

బ్యాంక్ రుణ సదుపాయం:

ఈ వ్యాపారం కోసం కావాలంటే బ్యాంక్ రుణం కూడా తీసుకోవచ్చు. బ్యాంకులు రూ.10 లక్షల వరకూ రుణాలు ఇస్తాయి. ముద్ర (Mudra) పథకంలో భాగంగా ఈ రుణం పొందవచ్చు. మీరు గంటలో 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చెయ్యగలిగితే… మీరు నెలకు రూ.50 వేల వరకు సంపాదించవచ్చు.

ఆదాయం పెంచుకోవడం ఎలా?

మీరు 150 మంది రెగ్యులర్ కస్టమర్లను ఏర్పాటు చేసుకోగలిగితే.. వారు రోజూ ఒక క్యాన్ చొప్పున నీరు వాడుతున్నట్లయితే.. మీరు రోజూ 150 కేన్ల వాటర్ సరఫరా చేయగలరు. నెలకు 4,500 కేన్లను సరఫరా చేసినట్లు అవుతుంది. ఒక్కో క్యాన్ బయట షాపుల్లో రూ.40 వరకు ఉంటోంది. మీరు రూ.25కే ఇవ్వవచ్చు. ఇలా ఇచ్చినా మీరు నెలకు రూ.1.12 లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇందులో నెలవారీ ఖర్చులు, అద్దెలు, జీతాలు, కరెంటు బిల్లు పోగా… మీకు రూ.50 వేలు మిగిలే అవకాశం ఉంటుంది. అయితే లభాలు పొందాలంటే మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది.

అయితే ఇంకో అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా వద్దనుకుంటే మీరు పెద్ద కంపెనీలైన బిస్లరీ, ఆక్వాఫినా వంటివి కూడా 20 లీటర్ల క్యాన్లను సరఫరా చేయవచ్చు. అలాంటి కంపెనీల డీలర్‌షిప్ మీరు పొందగలిగితే… మీరు ఉన్న ప్రాంతంలోనే మీరే వాటిని ప్రజలకు, షాపులకూ సరఫరా చేయవచ్చు. ఈ విధంగా కూడా మీకు భారీ లాభాలు ఉంటాయి. కాకపోతే… డీలర్‌షిప్‌కి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

బంపర్‌ ఆఫర్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌.. రోజు 2జీబీ డేటా, మరి ఇతర నెట్‌వర్క్‌ల ప్లాన్స్‌..

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు 300 చొప్పున ఆదా చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు..!

వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్