బంపర్‌ ఆఫర్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌.. రోజు 2జీబీ డేటా, మరి ఇతర నెట్‌వర్క్‌ల ప్లాన్స్‌..

టెలికాం సంస్థలు రోజురోజుకు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా (వి) నెట్‌ వర్క్‌లు ఎప్పటికప్పుడు..

1/5
Mobile
టెలికాం సంస్థలు రోజురోజుకు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా (వి) నెట్‌ వర్క్‌లు ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగారులను పెంచుకుంటున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా వినియోగారులకు మంచి ఆఫర్‌ ప్రకటించింది.
2/5
Bsnl
బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజాగా రూ.187 ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.187తో రీఛార్జ్‌ చేసుకుంటే ప్రతి రోజు 2జీబీ హైస్పీడ్‌ డేటా, 28 రోజుల పాటు వ్యాలిడిటీ పొందనున్నారు. అతేకాదు రోజువారీ డేటా ముగిసిన తర్వాత అపరిమితంగా బ్రౌజింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే డేటా స్పీడు మాత్రం తగ్గుతుంది. 28 రోజు వ్యాలిడిటితో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉంటాయి.
3/5
Airtel
అయితే ఈ ప్లాన్‌ను పోలిన ఇతర నెట్‌వర్క్‌లు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ రూ.199తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజు 1.5జీబీ డేటా, 28 రోజు పాటు వ్యాలిడిటీ పొందునున్నారు. అలాగే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి.
4/5
Jio
రిలయన్స్‌ జియో రూ.199 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ, రోజు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌,100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు.
5/5
Vi
వోడాఫోన్‌ ఐడియా (వి) ఈ కస్టమర్లు రూ.199తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజు1జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల పాటు వ్యాలిడిటీ పొందనున్నారు.