వినియోగదారులకు అలర్ట్.. మరో ట్విస్ట్ ఇచ్చిన వాట్సప్.. ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఆ సర్వీసులు పొందలేరు..

Whats App: ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సప్.. మే 15 వరకు ప్రైవసీ పాలసీ నిబంధనలను అంకీకరించకపోతే వారి ఖాతాలను డెలీట్ చేయబోమని చెప్పిన సంగతి తెలిసిందే.

వినియోగదారులకు అలర్ట్.. మరో ట్విస్ట్ ఇచ్చిన వాట్సప్.. ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఆ సర్వీసులు పొందలేరు..
Whats App

Whats App: ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సప్.. మే 15 వరకు ప్రైవసీ పాలసీ నిబంధనలను అంకీకరించకపోతే వారి ఖాతాలను డెలీట్ చేయబోమని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వాట్సప్ వినియోగదారులు కాస్తా ఊపిరి తీసుకున్నారు. కానీ తాజాగా వాట్సప్ తమ వినియోగదారులకు మరో ట్విస్ట్ ఇచ్చింది. వాట్సప్ సేవ నిబంధనలు, ప్రైవసీ విధానాన్ని జనవరిలో అప్ డేట్ చేసింది. ఇక కొత్తగా వచ్చిన మార్పుల గురించి తమ వినియోగదారులకు తెలియజెస్తూ.. అదే క్రమంలో నోటిఫికేషన్స్ పంపడం కూడా ప్రారంభించింది. ఆ తర్వాత యూజర్ ప్రైవసీ విధానం మీద వెలువడ్డ విమర్శల నేపథ్యంలో వాట్సప్ వెనక్కు తగ్గింది. తాజాగా వాట్సప్ మరికొన్ని నిర్ణయాలను తీసుకుంది. అవెంటంటే.. మే 15 తర్వాత ప్రైవసీ పాలసీ నిబంధనలు అంగీకరించకపోతే వారి అకౌంట్స్ డెలీట్ కావు.. కానీ సర్వీసులు తగ్గిపోనున్నాయి.

అంటే కొత్త నిర్ణయాల ప్రకారం.. కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే.. కొన్ని వారాల తర్వాత చాట్ లిప్ట్ కనిపించదు. అంతేకాదు.. కొన్నాళ్ళ తర్వాత వాట్సాప్ కాలింగ్ కూడా బ్లాక్ అవుతుంది. అప్పుడు కాల్ చేద్దామన్నా కాల్స్ వెళ్లవు. అప్పటికీ పాలసీకి ఒకే చెప్పకపోతే… కొన్ని వారాల తర్వాత రిమైండర్లు మారిపోతూ ఉంటాయి. అప్పటికీ పాలసీకి ఆమోదం చెప్పకపోతే.. కాల్స్, మెసేజ్‏లు కూడా ఆగిపోతాయి. మొత్తంగా చూస్తే.. ఎలాగోలా ప్రైవసీ పాలసీని ఆమోదించుకునేలా వాట్సాప్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రైవసీ పాలసీ విధానంపై మొదట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. ఇక అదే సమయంలో వాట్సాప్ తరహాలోనే మరిన్ని అప్ వాడడం ప్రారంభించారు. దీంతో వాట్సప్ యూజర్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇక ఇదే విషయం కేంద్రం, సుప్రీంకోర్టు కాంపిటేషన్ కమిషన్ ఆప్ ఇండియా. . అభ్యంతరాలను పక్కన పెట్టి… తన రూట్లోనే వెళ్తూ… పరోక్షంగా సర్వీసులు తగ్గించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సర్వీసులను తగ్గిస్తే… వినియోగదారులు కచ్చితంగా ప్రైవసీ పాలసీ నిబంధనను ఒప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది.

ఇక కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో మే 15 తర్వాత అకౌంట్లు డెలీట్ కావు.. కానీ సర్వీసులు తగ్గిపోతాయి. కొత్త పాలసీకి సంబంధించి రిమైండర్ వచ్చినప్పుడు నేను దాన్ని ఓకే చెయ్యకపోతే… అప్పుడు ఏమవుతుంది అని ఓ యూజర్… వాట్సాప్‌ని ప్రశ్నించగా… “అలా చేస్తే… మీకు సర్వీసులు తగ్గిపోతాయి. మీరు ఆమోదించేవరకూ సర్వీసుల్లో కోత ఉంటుంది. మీరు చాట్ లిస్ట్ చూడలేరు, మీకు వచ్చే వాట్సాప్ ఫోన్ కాల్స్‌, వీడియో కాల్స్‌కి మీరు రిప్లై ఇవ్వలేరు, అలాగే గ్రూపులలో నుంచి మీ నంబర్ తొలగించబడుతుంది, అలాగే వాట్సాప్ బ్యాకప్ సర్వీసు కూడా కోల్పోతారు..” అని వాట్సాప్ తెలిపింది.

Also Read: Business Idea: కరోనా పరిస్థితుల్లో సరైన వ్యాపారం.. నెలకు రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం..!

ఆ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన సంస్థ.. వారికి బెనిఫిట్..