Marine animals: ఎప్పుడో 273 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిన సముద్రజీవులు తాజాగా ఉనికిలో..

Marine Animals alive: సైన్స్ ఎప్పుడూ పూర్తిగా అంతుపట్టదు. ఇప్పుడు అవునన్నది రేపు కాదనే విధంగా మారిపోతుంది. ఒకప్పుడు ఉండేది అనేది ఇప్పుడు ప్రత్యక్షం అయ్యే అవకాశమూ ఉంటుంది.

Marine animals: ఎప్పుడో 273 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిన సముద్రజీవులు తాజాగా ఉనికిలో..
Marine
KVD Varma

|

May 10, 2021 | 10:14 PM

Marine animals Alive: సైన్స్ ఎప్పుడూ పూర్తిగా అంతుపట్టదు. ఇప్పుడు అవునన్నది రేపు కాదనే విధంగా మారిపోతుంది. ఒకప్పుడు ఉండేది అనేది ఇప్పుడు ప్రత్యక్షం అయ్యే అవకాశమూ ఉంటుంది. సైన్స్.. పరిశోధనలు నిరంతర ప్రక్రియలు ఇవి జరుగుతూనే ఉంటాయి. కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఒక్కోసారి పాత విషయాలు మళ్ళీ తెరమీదకు వస్తుంటాయి. అబ్బే అదిప్పుడు లేదండీ అని చెప్పే మాట తప్పయిపోయి ఇంకా ఉందిగా అని ఆశ్చర్యపరిచే బోలెడు విశేషాలు సైన్స్ ఎప్పటికప్పుడు మనకి అందిస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో 273 మిలియన్ సంవత్సరాలు సముద్ర జంతువులు అంతరించిపోయాయని భావించారు. అయితే, అవి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చాయని కనిపెట్టారు.

అవును..సుదీర్ఘకాలం కోల్పోయినట్లు భావించిన సహజీవన జీవులు సముద్రపు అడుగుభాగంలో అభివృద్ధి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొన్ని జీవన రూపాలు వందల మిలియన్ల సంవత్సరాలుగా అంతరించిపోయాయని భావించారు, కాని కొత్త ఆవిష్కరణ ప్రతి విషయాన్నీ మారుస్తోంది.

“జీవన శిలాజాలు” గా పిలువబడే సముద్ర జంతువులను అధికారికంగా క్రినోయిడ్స్ లేదా సముద్రపు లిల్లీస్ అని పిలుస్తారు. జపాన్లోని పసిఫిక్ మహాసముద్రంలో నేల దిగువన, హోన్షు మరియు షికోకు తీరాల వెంబడి ఇవి ఇప్పుడు తాజాగా కనుగొన్నట్టు సైన్స్అలర్ట్ నివేదించింది. నిజానికి ఈ సముద్ర జీవులు 273 మిలియన్ సంవత్సరాలుగా అంతరించిపోయాయని భావిస్తూ వచ్చారు. ప్రస్తుత ఈ ఆవిష్కరణ ఒక అద్భుతానికి తక్కువ కాదు. రెండు సముద్ర జంతువుల మధ్య పంచుకున్న సహజీవన సంబంధం..అటువంటి జంతువులలో ఇలాంటి అనుబంధాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఈ ఆవిష్కరణ సహాయపడుతుంది.

పాలిజోయిక్ యుగంలో క్రినోయిడ్స్, పగడాలు ఒక పరస్పర ఆధారిత సంబంధాన్ని కలిగి ఉన్నాయని శాస్త్రీయ రికార్డులు చెబుతాయి. నీరు వెచ్చగా, ఫిల్టర్-ఫీడింగ్ ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్న సముద్రపు అడుగుభాగం లోని ఎగువ ప్రాంతాలకు చేరుకోవడానికి పగడాలు క్రినోయిడ్లను ఎలా పెంచుతాయో పరిశోధకులు తాజాగా గుర్తించారు. కానీ శాస్త్రవేత్తలు ఈ జీవుల గురించి కనీసం 273 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి వచ్చిన శిలాజ రికార్డులను గమనించలేదు. ఈ సహజీవన జీవుల విలుప్తతను వారు ఇంతకు ముందే నిర్ధారించారు. ఇప్పుడు ఇటువంటి బహుళ క్రినోయిడ్లు, పగడాలను సముద్ర ప్రపంచంలోని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

పగడపు రెండు జాతులు “అబిస్సోన్తుస్” అలాగే, “మెట్రిడియోయిడియా”, (Marine animals Alive) వీటిలో పూర్వం చాలా అరుదుగా ఉండేవి. ఇవి సముద్రపు ఉపరితలం నుండి 330 అడుగుల దిగువన కనుగొన్నారు ఇప్పుడు. పరిశోధనా బృందానికి పోలాండ్‌లోని వార్సా విశ్వవిద్యాలయానికి చెందిన పాలియోంటాలజిస్ట్ మికోనాజ్ జపాల్స్కీ నాయకత్వం వహించారు. జపనీస్, పోలిష్ పరిశోధనల ఉమ్మడి బృందం జంతువుల చిత్రాలను పరిశీలించడానికి, క్లిక్ చేయడానికి “స్టీరియోస్కోపిక్ మైక్రోస్కోపీ” అని పిలువబడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. అంతర్గత నిర్మాణాలను గుర్తించిన తర్వాత, జాతులను అర్థం చేసుకోవడానికి DNA బార్‌కోడింగ్ ఉపయోగించారు. ఈ పరిశోధనలో అందరూ ఆశ్చర్య పడేలా ఎప్పుడో ఉనికిని కోల్పోయిన సముద్ర జీవులను తిరిగి గుర్తించడం జరిగింది. అందుకే సైన్స్ ఒక నిరంతర ప్రక్రియ. అంతం లేనిది. ఈ పరిశోధన ఇటీవల “పాలియోజియోగ్రఫీ, పాలియోక్లిమాటాలజీ, పాలియోఇకాలజీ” లో ప్రచురించారు.

Also Read: Corona Test: తేనె టీగలతో నిమిషాల వ్యవధిలోనే కోవిడ్ పరీక్షల ఫలితాలు.. అదెలాగో మీరూ తెలుసుకోండి..

Corona New Variant: కరోనా కొత్త వేరియంట్లపై యుద్ధం కోసం మరో వ్యాక్సిన్ అవసరం లేదు..ఇవి సరిపోతాయి..వెల్లడించిన బయోఎన్టెక్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu