- Telugu News Photo Gallery Science photos Corona test honey bees trained for covid 19 test results netherlands
Corona Test: తేనె టీగలతో నిమిషాల వ్యవధిలోనే కోవిడ్ పరీక్షల ఫలితాలు.. అదెలాగో మీరూ తెలుసుకోండి..
Corona Test: తేనె టీగలతో నిమిషాల వ్యవధిలోనే కోవిడ్ పరీక్షల ఫలితాలు.. అదెలాగో మీరూ తెలుసుకోండి..
Updated on: May 10, 2021 | 10:01 PM

కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ లక్షణాలను ఇక తేనెటీగలు కూడా గుర్తిస్తాయట..ఇందుకు అనువుగా నెదర్లాండ్స్ లోని పరిశోధకులు వీటికి శిక్షణనిస్తున్నారు.

తేనెటీగలకు వాసనను పసిగట్టే అసాధారణ గుణం ఉందని, అదే ఇందుకు దోహదపడుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

కోవిడ్ టెస్ట్ ఫలితాలకోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించుకోవడంలో తేనెటీగలు చాలా ఉపయుక్తంగా ఉంటాయని చెబుతున్నారు.

మొదట కోవిడ్ ఇన్ఫెక్షన్ శాంపిల్స్ ని వీటికి చూపుతామని, స్ట్రా వంటి తమ నాలుకలతో ఇవి వాటి వాసన పీల్చుతాయని రీసీర్చర్లు తెలిపారు.

‘రివార్డు’గా చక్కర కలిపిన నీటిని వీటికి ఇస్తామన్నారు.ఇన్ఫెక్షన్ సోకని శాంపిల్ ని చూపితే వీటికి ఈ రివార్డు ఉండదని తెలిపారు. కోవిడ్ నమూనాలను చూపినప్పుడు ఇవి తమ నాలుకలను చాచవని తేలిందన్నారు. కానీ షుగర్ వాటర్ ఇస్తే మాత్రం అందుకుంటాయని పరిశోధకులు చెప్పారు.

ఇలా వీటి వల్ల కోవిడ్ ఫలితాలను త్వరగా గుర్తించవచ్చునన్నారు. వీటి రెస్పాన్స్ తక్షణమే ఉంటుందన్నారు. ఇది చౌక అయిన పధ్దతి అని, టెస్టులు తక్కువగా జరిగే దేశాల్లో ఇది ప్రయోగాజనకరంగా ఉంటుందని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు.




