AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ డబ్బును తప్పుగా ఇతర ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశారా.? టెన్షన్ పడకండి.! ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.!

మీరు అనుకోకుండా డబ్బును వేరొకరి ఖాతాకు బదిలీ చేస్తే, ఆ నగదును మళ్లీ ఎలా తిరిగి పొందగలరు? ఆ మొత్తాన్ని తిరిగి మీ ఖాతాలోకి క్రెడిట్ చేసే అధికారం...

మీ డబ్బును తప్పుగా ఇతర ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశారా.? టెన్షన్ పడకండి.! ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.!
Online Payment
Ravi Kiran
|

Updated on: May 13, 2021 | 8:17 AM

Share

Transferred Money to a Wrong Account: ఈ రోజుల్లో ఆన్‌లైన్ డబ్బు బదిలీలు సర్వసాధారణం అయిపోయాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ), పేటిఎమ్, నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి ఎన్నో రకాల థర్డ్ పార్టీ నగదు లావాదేవీల యాప్స్ అందుబాటులోకి రావడంతో.. బ్యాంకులకు వెళ్లకుండానే జనాలు డబ్బును ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మీరు అనుకోకుండా డబ్బును వేరొకరి ఖాతాకు బదిలీ చేస్తే, ఆ నగదును మళ్లీ ఎలా తిరిగి పొందగలరు? ఆ మొత్తాన్ని తిరిగి మీ ఖాతాలోకి క్రెడిట్ చేసే అధికారం బ్యాంకుకు ఉందా? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాంకుకు సమాచారం ఇవ్వండి..

పొరపాటున వేరొకరి ఖాతాకు డబ్బు బదిలీ చేయబడితే, మీరు ఆ లావాదేవీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని.. అంటే టైం, డేట్, అమౌంట్, ఆ ఖాతా నెంబర్ లాంటివి మీ బ్యాంకుకు తెలియజేయాలి.

చెల్లని ఖాతాకు డబ్బు బదిలీ అయిన సందర్భంలో..

చాలాసార్లు, డబ్బు పంపేటప్పుడు, ఖాతా నంబర్ లేదా ఐఎఫ్‌సీ కోడ్ మొదలైన వాటిని ఫిల్ చేసేటప్పుడు జనాలు తప్పుగా టైప్ చేస్తుంటారు. దీనివల్ల డబ్బు వేరొకరి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు అవి ఇన్‌వ్యాలిడ్ అకౌంట్‌లు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో, డబ్బు ఆటోమేటిక్‌గా తిరిగి డిపాజిట్ అవుతుంది.

ఫిర్యాదు చేసే అవకాశం…

పొరపాటున డబ్బు బదిలీ మరొక వ్యక్తి ఖాతాలోకి చేయబడితే, వాటిని తిరిగి తీసుకొచ్చేందుకు ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించాలి. మీరు డబ్బులు పంపిన ఖాతా.. మీ బ్యాంకు సంబంధించిన బ్రాంచ్ అయినట్లయితే.. అప్పుడు బ్యాంకు మేనేజర్‌కు లావాదేవీ పూర్తి సమాచారాన్ని అందించండి. అప్పుడు మేనేజర్ లబ్ధిదారుని సంప్రదించి, డబ్బును తిరిగి పంపమని అభ్యర్థిస్తాడు. డబ్బు అందుకున్న వ్యక్తి అంగీకరించినట్లయితే, ఆ డబ్బు 7 పని దినాలలో మీ ఖాతాకు తిరిగి వస్తుంది. ఒకవేళ లబ్ధిదారుడు మరేదైనా శాఖకు చెందినవాడు అయితే, మీరు ఆ బ్రాంచ్‌కు వెళ్లి బ్యాంక్ మేనేజర్‌తో ఒక పరిష్కారం కోసం మాట్లాడాల్సి ఉంటుంది. మీ ఫిర్యాదుపై బ్యాంక్ ఏమీ చేయకపోతే మీరు అంబుడ్స్‌మన్‌(Ombudsman)కు ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ సంస్థ ఇది.

మీ డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే…

సదరు వ్యక్తి మీకు డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే, మీరు ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అయితే, దీని కోసం, మీరు ఏ తప్పు కారణంగా ఆ ఖాతాకు డబ్బు బదిలీ అయిందన్న విషయాన్ని నిరూపించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఖాతా నంబర్, బ్యాంక్ బ్రాంచ్, ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలి.

Also Read:

 షాకింగ్ యాక్సిడెంట్.. గాల్లో ఎగిరిన బైక్‌రైడర్‌.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

గగుర్పాటుకు గురిచేసే వీడియో.. పక్షి గూటిలోకి భారీ పైథాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!