అద్భుతమైన స్కీం.. ప్రతీ నెలా రూ. 1500 జమ చేయండి.. రూ. 53 లక్షలు పొందండి.. వివరాలివే.!

Mutual Fund Scheme: అసలే కరోనా కాలం.. ఆపై అంతంతమాత్రంగా వస్తోన్న జీతాలు.. ఈ తరుణంలో ప్రజలందరూ కూడా డబ్బులు పొదుపు చేసేందుకు.

అద్భుతమైన స్కీం.. ప్రతీ నెలా రూ. 1500 జమ చేయండి.. రూ. 53 లక్షలు పొందండి.. వివరాలివే.!
Ravi Kiran

|

May 13, 2021 | 11:25 AM

Mutual Fund Scheme: అసలే కరోనా కాలం.. ఆపై అంతంతమాత్రంగా వస్తోన్న జీతాలు.. ఈ తరుణంలో ప్రజలందరూ కూడా డబ్బులు పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం అనేక రకాల పథకాలు సైతం అందుబాటులో ఉన్నాయి, అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక మొత్తంలో రాబడి పొందవచ్చునని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదాహరణకు మీరు ప్రతీ నెలా రూ. 1500 పెట్టుబడి పెట్టడం ద్వారా నిర్ణీత సమయానికి సుమారు రూ. 50 లక్షల వరకు రాబడి పొందవచ్చు. అంటే రోజుకు మీరు రూ. 50 ఆదా చేస్తే చాలు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆఫ్ ఇండియా(Franklin Templeton Of India) వెబ్‌సైట్‌లో ఇచ్చిన కాలిక్యులేటర్ ప్రకారం, మీకు 12% రాబడి లభిస్తే, 30 సంవత్సరాల తరువాత మీకు 53 లక్షలు లభిస్తాయి. మరోవైపు, మీరు మ్యూచువల్ ఫండ్ పథకంలో ప్రతీ నెలా 1000 రూపాయలు పెట్టుబడి పెడితే, 20 సంవత్సరాల తరువాత, మీకు రూ. 20 లక్షలు పొందవచ్చు.

మ్యూచువల్ ఫండ్ల రకాలు ఎన్ని.?

సాధారణంగా నాలుగు రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వీటిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెబిట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్. ప్రతీ ఫండ్‌‌కు లాభాలు, నష్టాలు కూడా ఉన్నాయి. పెట్టుబడిదారులు తమ ఎంపిక, సంస్థ నేపథ్యం ప్రకారం పెట్టుబడి పెట్టొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం మంచిది, అవి మంచి రాబడి అందిస్తాయని చెబుతున్నారు.

ఎలా పెట్టుబడి పెట్టవచ్చు…

మీరు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఆ సంస్థ వెబ్‌సైట్ నుండి సమాచారాన్ని పొందడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుని నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. కుదిరితే మ్యూచువల్ ఫండ్ సలహాదారు సేవను కూడా ఉపయోగించవచ్చు. డైరెక్ట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మధ్యవర్తి కమీషన్‌ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read:

 షాకింగ్ యాక్సిడెంట్.. గాల్లో ఎగిరిన బైక్‌రైడర్‌.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

గగుర్పాటుకు గురిచేసే వీడియో.. పక్షి గూటిలోకి భారీ పైథాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu