Israel Palestine: అట్టుడుకుతున్న పాలస్తీనా – ఇజ్రాయెల్‌.. తీవ్రమవుతున్న బాంబు దాడులు.. 72 మంది మృతి

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు ఉధృతమవుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులకు పాల్పతుండగా.. ఇజ్రాయెల్‌ గాజాపై వైమానిక దాడులు జరుపుతోంది.

Israel  Palestine: అట్టుడుకుతున్న పాలస్తీనా – ఇజ్రాయెల్‌.. తీవ్రమవుతున్న బాంబు దాడులు.. 72 మంది మృతి
Israel Palestine Hamas Launches Fresh Rocket Attacks

Israel – Palestine Attacks: ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు ఉధృతమవుతున్నాయి. తారా జువ్వలు విసురుకున్నది ఈజీ రాకెట్లతో పరస్పర దాడులకు తెగబడుతున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులకు పాల్పతుండగా.. ఇజ్రాయెల్‌ గాజాపై వైమానిక దాడులు జరుపుతోంది. ఇరువర్గాల దాడులతో ఇప్పటి వరకు గాజాలో 65 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇజ్రాయెల్‌లో ఏడుగురు మృతి చెందారు. గాజా స్ట్రిప్‌పై భారీ బాంబుదాడులు కొనసాగుతున్నాయని, ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో సీనియర్‌ సభ్యులతో పాటు గాజా సిటీ కమాండ్‌ బస్సెం ఇస్సా మృతి చెందాడని హమాస్‌ ధ్రువీకరించింది.

దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్‌– పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్, ఇతర ఉగ్ర సంస్థల అధీనంలోని గాజా సిటీ నుంచి పాలస్తీనా మీదకు, పాలస్తీనా నుంచి గాజా సిటీ వైపునకు లెక్కకు మించిన రాకెట్లు దూసుకొస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని రెండు అపార్ట్‌మెంట్లు కుప్పకూలాయి. సెంట్రల్‌ గాజాలోని అత్యంత ఎత్తయిన భవంతుల్లో చాలా వాటిని ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి.

వరుస దాడుల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. గాజాలో మరణించిన వారిలో 16 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా 65 పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 86 మంది పిల్లలు, 39 మంది మహిళలు సహా 365 మంది గాయపడ్డారని పేర్కొంది. గాజాలో ఓ కారుపై క్షిపణి పడటంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా రాకెట్ల వర్షం కురిస్తామని హమాస్‌ కమాండర్లు ప్రకటించిన వీడియో దృశ్యాలను ఇజ్రాయెల్‌ టీవీ చానళ్లు ప్రత్యక్షప్రసారంచేశాయి. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ మెట్రో ప్రాంతంపై ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. హమాస్‌ ఉగ్రవాదులు యుద్ధ ట్యాంక్‌ విధ్వంసక క్షిపణిని సరిహద్దులో ప్రయోగించగా ఒక ఇజ్రాయెల్‌ దేశస్తుడు మరణించాడు. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. మరణించిన వారు పౌరులా? సైనికులా? అనేది తెలియాల్సి ఉంది.

మరో టెల్‌ అవీవ్‌ మెట్రో పాలిటన్‌ ప్రాంతం, దక్షిణాది నగరాల్లో బుధవారం రాత్రి హమాస్‌ రాకెట్లతో దాడులకు దిగడంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందగా.. కనీసం 20 మంది ఇజ్రాయిలీలు గాయపడ్డారు. ఓ రాకెట్‌ ఇంటి కిటికీలో నుంచి దూసుకువచ్చి బాలుడితో పాటు అతని తల్లిని గాయపరిచింది. తీవ్రంగా గాయపడడంతో బాలుడు మృతి చెందారు. గాజా సరిహద్దులో ఐదుగురు ఇజ్రాయెల్ పౌరులు, ఓ భారతీయుడు, మరో ఐడీఎఫ్‌ సైనికుడు మరణించాడు. ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఉగ్రవాదులు మా దేశం మీదకు ఏకంగా 1,050 రాకెట్లతో దాడులు చేశారని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. వీటిలో 200 రాకెట్లు గురితప్పి వాళ్ల అధీనంలోని గాజా సిటీలోనే పడిపోయాయని సైన్యం పేర్కొంది. గాజా నుంచి తమ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను నేలకూల్చామని సైన్యం ప్రకటించింది. సరిహద్దున ఉన్న ఇజ్రాయెల్‌ నగరం టెల్‌ అవీవ్‌ సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని సైన్యం పేర్కొంది.


కాగా, ఇజ్రాయెల్‌ వెయ్యికిపైగా రాకెట్లను ప్రయోగించగా.. ఇజ్రాయెల్‌ సైతం ధీటుగా దాడులకు పాల్పడుతోంది. రాజధాని నగరం జెరూసలేంలోని ఆల్‌ అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్‌ బలగాలు, పాలస్తీనియన్ల మధ్య సోమవారం జరిగిన ఘర్షణ ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించింది.


ఇజ్రాయెల్‌ దాడుల్లో పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు చెందిన గాజా సిటీ కమాండర్‌ బసీమ్‌ ఇసా సహా ఇంకొందరు ఉగ్రవాదులు మరణించారు. గాజాలో గత ఏడేళ్లలో సిటీ కమాండర్‌ స్థాయి ఉగ్రవాది మరణించడం ఇదే తొలిసారి. కాగా, పరస్పర రాకెట్ల దాడులపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ మాట్లాడారు. ‘మా వైపు తీవ్రమైన నష్టం జరిగితే ఊహించని స్థాయిలో దీటైన సమాధామిస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also…  CP Sajjanar: అతనే ప్రధాన సూత్రధారి.. కూకట్‌పల్లి ఏటీఎం దోపిడి కేసులో ఇద్దరు అరెస్ట్: సీపీ సజ్జనార్