COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. లాటరీ ఫ్రీ.. మిలియన్ డాలర్ల బహుమానం.. ఎక్కడంటే?
Covid-19 vaccine lottery: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగం కొనసాగుతోంది. అయితే.. చాలా దేశాల్లో కరోనా టీకా ఎప్పుడు వేస్తారని.. ప్రజలు
Covid-19 vaccine lottery: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగం కొనసాగుతోంది. అయితే.. చాలా దేశాల్లో కరోనా టీకా ఎప్పుడు వేస్తారని.. ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. అయితే.. మరి కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తాం.. రండి బాబూ రండి అంటున్నా.. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో ప్రభుత్వం పలు ఆఫర్లను ప్రకటిస్తూ.. టీకా వేయించుకొనేలా ప్రజలను ఒప్పించడానికి నానా తంటాలు పడుతోంది.
ఈ క్రమంలో అమెరికాలోని ఒహైయో గవర్నర్ మైక్ డివైన్ రాష్ట్ర ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. టీకా వేయించుకొన్నవారిలో అదృష్టవంతులకు ప్రతి వారం 1 మిలియన్ డాలర్లు బహుమానంగా ఇస్తామని ట్వీట్ చేశారు. ఈ ఆఫర్ 18 సంవత్సరాలు దాటి కనీసం ఒక డోసు తీసుకున్నవారికి వర్తిస్తుందని ట్వీట్ చేశారు. అయితే ఈ ఆఫర్ ను కొందరు కొట్టి పారేస్తుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు. డబ్బు వృధా అంటూ ఈ నిర్ణయాన్ని కొందరు తప్పుపట్టినా.. ఇది మంచి ఆలోచనే అంటూ అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో టీకాలు అందుబాటులో ఉన్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదంటూ అభిప్రాయపడుతున్నారు.
ఒహైయో గవర్నర్ మైక్ డివైన్ ప్రకటించిన లాటరీలో తొలి విజేత పేరును మే 26వ తేదీన ప్రకటించనున్నారు. తర్వాత వారం విజేతను మొదటి విజేత లాటరీ తీసి నిర్ణయిస్తారని తెలిపారు. 17ఏళ్ల లోపు వారికి మాత్రం మరో ప్రత్యేకమైన లాటరీని ప్రకటించారు. ఇందులో విజేతలకు డబ్బులు ఇవ్వరు.. ఏడాది పాటు స్కూల్ స్కాలర్‌షిప్‌ను ఇవ్వనున్నారు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో విద్య అత్యంత ఖరీదైన వ్యవహారం. అమెరికాలో ఇప్పటి వరకు 58.7శాతం మంది ప్రజలు టీకాలు తీసుకొన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో టీకా వేయించుకుంటే ఫ్రీగా బీర్లు ఇస్తాం.. డోనట్స్ ఇస్తాం.. సేవింగ్స్ బాండ్స్ ఇస్తాం అంటూ ప్రచారం చేస్తున్నారు. అయినా ఫలితం కనబడటం లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: