Covid-19: అమెరికా ప్రజలకు ఇక మాస్క్‌ నుండి విముక్తి…కరోనాను గెలిచినట్లేనా?

అమెరికన్లకు ఇక మాస్క్‌ల నుండి విముక్తి లభించనుంది. అమెరికాలో పూర్తిగా టీకాలు తీసుకున్న ప్రజలు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఆ మేరకు దేశ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటన చేసింది.

Covid-19: అమెరికా ప్రజలకు ఇక మాస్క్‌ నుండి విముక్తి...కరోనాను గెలిచినట్లేనా?
US President Biden(File Photo)
Janardhan Veluru

|

May 14, 2021 | 1:13 PM


అమెరికన్లకు ఇక మాస్క్‌ల నుండి విముక్తి లభించనుంది. అమెరికాలో పూర్తిగా టీకాలు తీసుకున్న ప్రజలు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఆ మేరకు దేశ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటన చేసింది. అయితే బస్సులు, విమానాలు, ఆస్పత్రులు, జైళ్లు మరియు షెల్టర్‌ హోమ్స్‌ వంటి రద్దీగా ఉండే ఇండోర్ సెట్టింగులలో మాత్రం మాస్కులు ధరించాలని సీడీసీ సూచించింది. దేశంలో కరోనా కేసులు, మరణాలు కనిష్ట స్థాయిలకు చేరడంతో పాటు జనాభాలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తవడంతో  సీడీసీ ఈ నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ స్టేట్స్ కరోనా మహమ్మారికి ముందున్న జీవితానికి వేగంగా తిరిగి వస్తోందడానికి ఇదే అతిపెద్ద సూచన అని భావిస్తున్నారు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) కొత్తగా వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం…పూర్తిగా టీకాలు వేసిన ప్రజలు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఈ సిఫార్సు ఇంటి లోపల మరియు ఆరుబయట రెండింటికీ వర్తిస్తుందని సిడిసి తెలిపింది. అయితే స్టేట్, లోకల్, ప్రాదేశిక చట్టాలు, పని ప్రదేశాలలోని నియమాల ప్రకారం మాత్రం అవసరమైన చోట్ల మాస్కు ధరించాల్సి  ఉంటుంది. పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులు COVID-19 కు సంక్రమించే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్క డోసు టీకా తీసుకున్నవారు రెండవ డోసు తీసుకునే వరకూ కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అమెరికాలోని వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు ప్రయాణానికి ముందు లేదా తరువాత లేదా తర్వాత సెల్ఫ్‌ క్వారంటైన్ ఉండనవసరం లేదు. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతించిన మూడు రకాల వ్యాక్సిన్లుతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగం కోసం అనుమతించిన ఇతర వ్యాక్సిన్లకు కూడా ఇవే మార్గదర్శకాలు వర్తిస్తాయని సీడీసీ స్పష్టంచేసింది. కరోనా వ్యాధిని నివారించడంలో టీకాలు ప్రభావవంతంగా ఉన్నాయని తెలిపిన సీడీసీ..ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యం మరియు మరణం సంభవించే ప్రమాదాన్ని టీకాలు చాలా వరకూ తగ్గించాయని పేర్కొంది.

నిన్న (13-05-21) ఈ ప్రకటన తరువాత, అధ్యక్షుడు జో బైడెన్ మరియు ఉపాధ్యక్షుడు కమలా హారిస్ మాస్క్‌లు ధరించకుండా వైట్ హౌస్ యొక్క రోజ్ గార్డెన్ వద్ద విలేకరుల ముందు హాజరయ్యారు. “ఇది గొప్ప మైలురాయి అని నేను అనుకుంటున్నాను. ఒక గొప్ప రోజు. చాలా మంది అమెరికన్లకు టీకాలు వేయడంలో మేము సాధించిన అసాధారణ విజయం ద్వారా ఇది సాధ్యమైంది” అని బైడెన్ చెప్పారు.  114 రోజుల్లో 250 మిలియన్ వ్యాక్సిన్ షాట్లు ఇచ్చినట్లు బైడెన్ తెలిపారు. వైరస్ అనేక దేశాలలో విషాదకరంగానే ఉందని..కానీ వ్యాక్సినేషన్‌ ఫలితంగా అమెరికాలోని 50 రాష్ట్రాలకుగాను 49 రాష్ట్రాలలో కేసులు తగ్గాయని గుర్తుచేశారు. 2020 ఏప్రిల్ నుండి అంటే మహమ్మారి విజృంభణ మొదలైనప్పటి నుంచి కనిష్ట స్థాయిలో కరోనా రోగులు ఆసుపత్రిలో చేరినది ఈ ఏప్రిల్‌ లోనే అని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నట్లు తెలిపారు. 2020 ఏప్రిల్ నుండి చూస్తే మరణాలు కూడా 80 శాతం తగ్గి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి వేగంగా చెందుతోందన్న బైడెన్‌..కొద్ది నెలల్లోనే ఉద్యోగ కల్పన లో కూడా రికార్డు విజయాలు నమోదు చేశామని  బైడెన్‌ తెలిపారు.

మాస్క్ ధరించకుండా అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.

నాలుగు నెలల కిందట అమెరికాలోని వృద్దులలో వ్యాక్సినేషన్‌ 5.5 శాతం ఉండగా ఇప్పుడు దాదాపు 60 శాతం మందికి
కనీసం ఒక్క డోసు అయినా వ్యాక్సినేషన్‌ జరిగడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతించిన మూడు రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అవి… ఫైజర్-బయోఎంటెక్, మోడరనా, జాన్సన్ అండ్‌ జాన్సన్.

2020 డిసెంబరు-జనవరి 2021 మధ్య అమెరికాను సెకండ్ వేవ్ వణికించగా…రోజూవారీ కేసులు 2.5 లక్షలు, రోజువారీ మరణాలు 3వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా… 2021, మే 13 నాడు అమెరికాలో నమోదైన రోజువారీ కేసులు  36,412గా నమోదవుతుండగా…నిన్న రోజువారీ కరోనా మరణాలు -761 నమోదయ్యాయి.

అమెరికాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు మొత్తం – 3,26,43,851
అమెరికాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా మరణాలు మొత్తం – 5,80,837

అమెరికా మొత్తం జనాభా… 32.82 కోట్లు
13-05-2021 వరకూ వ్యాక్సిన్ పొందిన వారు – 26,65,96,486
అంటే… దేశ జనాభాలో 80 శాతం మందికి పైగా టీకా అందింది
ఇందులో ఒక్క డోసు టీకా పొందిన వారు – 15,46,24,231
అంటే… దేశ జనాభాలో 46.6 శాతం మందికి కనీసం ఒక డోసు టీకా వేయబడింది
రెండు డోసుల పూర్తి టీకా పొందిన వారు – 11,89,87,308
అంటే… దేశ జనాభాలో 35.8 శాతం మందికి రెండు డోసుల పూర్తి టీకా వేయబడింది.

ఇవి కూడా చదవండి…గుడ్ న్యూస్.. మరో వారంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి.. ధర ఎంతో తెలుసా.?

భారతీయ ప్రయాణికులకు ఊరట.. విమానాల రాకపోకలకు అనుమతినిచ్చిన ఆస్ట్రేలియా

కరోనా అప్‌డేట్స్ లైవ్‌లో వీక్షించండి..


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu