Australia Lift Travel ban: భారతీయ ప్రయాణికులకు ఊరట.. విమానాల రాకపోకలకు అనుమతినిచ్చిన ఆస్ట్రేలియా
భారత్ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఇవాళ అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు.
Australia Lift Travel ban: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తు్న్న నేపథ్యంలో ఆంక్షలు విధించిన దేశాలు మెల్లమెల్లగా సడలింపులు ఇస్తున్నాయి. ఇదే క్రమంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఇవాళ అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన వాణిజ్య విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆ దేశ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకొని సేవల ప్రతి సర్వీసు ప్రారంభానికి ముందు పటిష్ఠ తనిఖీ వ్యవస్థ ఉంటుందన్నారు. పూర్తి స్థాయి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు.
కరోనా నియంత్రణలో భాగంగానే విమాన ప్రయాణికులపై ఆంక్షలు విధించామన్న ఆయన మోరిసన్.. క్వారంటైన్ కేంద్రాలను దాటి ప్రజల్లోకి కరోనా వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఈ నిషేధం సహకరించిందన్నారు. తద్వారా అస్ట్రేలియాలో మూడో వేవ్ రాకుండా నిలువరించగలిగామన్నారు. మే 3న భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రయాణాలపై నిషేధం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారి అక్కడి ప్రభుత్వం తమ దేశ పౌరులపై కఠిన నిబంధనలు విధించింది. భారత్ నుంచి ప్రతి ప్రయాణికుడితో పాటు తమ దేశానికి చెందిన ఆస్ట్రేలియన్లపై కూడా తాత్కాలికంగా నిషేధం విధించింది. భారతదేశంలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగు పెడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చిరించింది.