Corona Vaccine for Children: కలవర పెడుతున్న అధ్యయనాలు.. దూకుడు పెంచిన దేశాలు.. పిల్లలకూ కరోనా వ్యాక్సీన్..

Corona Vaccine for Children: కరోనా సెకండ్​వేవ్​ వృద్ధులు, యువకులపైనే కాకుండా చిన్నపిల్లలపై కూడా దాడి చేస్తోంది. కరోనా థర్డ్​ వేవ్​ పిల్లలపైనే..

Corona Vaccine for Children: కలవర పెడుతున్న అధ్యయనాలు.. దూకుడు పెంచిన దేశాలు.. పిల్లలకూ కరోనా వ్యాక్సీన్..
Vaccine For Children
Follow us
Shiva Prajapati

|

Updated on: May 13, 2021 | 7:50 PM

Corona Vaccine for Children: కరోనా సెకండ్​వేవ్​ వృద్ధులు, యువకులపైనే కాకుండా చిన్నపిల్లలపై కూడా దాడి చేస్తోంది. కరోనా థర్డ్​ వేవ్​ పిల్లలపైనే ఎక్కువగా విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పిల్లలకు కూడా వ్యాక్సిన్​ ఇవ్వాలని వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ కంపెనీలు సంకల్సిస్తున్నాయి.

కరోనాకు సంబంధించి ప్రపంచంలో ఇప్పటి వరకూ అధికారికంగా దాదాపు 8 వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇవన్నీ కూడా 15 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఇవ్వగలిగే వ్యాక్సిన్లు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సువారికి కూడా ఇవ్వగలిగే వ్యాక్సిన్లపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, కెనడా వంటి దేశాలలో మరికొద్ది రోజులలో ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలాఉంటే.. 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలపై భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ మొదటి, రెండవ దశ క్లినికల్ ట్రయల్స్​ విజయవంతం అయ్యాయి. ఇప్పుడు మూడో దశ క్లినికల్ ట్రయల్ కోసం గురువారం నాడు డీసీజీఐ భారత్‌ బయోటెక్‌కు అనుమతులు మంజూరు చేసింది. ఢిల్లీ ఎయిమ్స్‌, పట్నా ఎయిమ్స్‌, నాగపూర్‌ మెడిట్రినా ఇన్‌స్టిట్యూట్ సహా దేశ వ్యాప్తంగా పలు చోట్ల క్లినికల్ పరీక్షలు జరగనున్నాయి.

మొడెర్నా టీకా.. 12 నుండి 17 సంవత్సరాల మధ్య టీనేజర్లకు ఇచ్చిన మొడెర్నా టీకా పరీక్షల ఫలితాలను వచ్చే వారంలో రానున్నాయి. మొడెర్నా సంస్థ 6 నుంచి 11 సంవత్సరాల పిల్లలపై కూడా తమ వ్యాక్సీన్ ని ప్రయోగిస్తోంది. అదే సమయంలో, 6 నెలల నుండి 11 సంవత్సరాల పిల్లలకు క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు జూలై తరువాత ఎప్పుడైనా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఫైజర్-బయోఎంటెక్.. అమెరికా కేంద్రంగా ఉన్న ఫైజర్‌-బయోఎంటెక్‌ సంస్థ పిల్లలకోసం అభివృద్ధి చేసిన టీకాకు ఇటీవలే కెనడా, అమెరికా దేశాలలో అనుమతి లభించింది. ఫైజర్-బయోఎంటెక్ 6 నెలల నుండి 2 సంవత్సరాల మధ్య పిల్లలకు కూడా టీకా పరీక్షను త్వరలో ప్రారంబించబోతోంది

ఆస్ట్రాజెనెకా కూడా తమ వ్యాక్సీన్‌ను 6 నెలలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇచ్చేందుకు పరీక్షలు జరుపుతోంది. ఇక జాన్సన్ & జాన్సన్ కూడా తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ను పిల్లలపై క్లినికల్ ట్రయల్స్‌కు ప్లాన్ చేస్తోంది. అలాగే నోవావాక్స్ సంస్థ 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల 3వేల మంది టీనేజర్లపై క్లినికల్ ట్రయల్స్‌ని ప్రారంభించింది.

పిల్లలు, పెద్దల వ్యాక్సిన్‌లో తేడా ఏమిటి..? కరోనా వ్యాక్సీన్ విషయంలో పెద్దలకు, చిన్న పిల్లలకు అదే వ్యాక్సీన్‌ని ఉపయోగించవచ్చు. అయితే పిల్లలకు, పెద్దలకు ఇచచే డోసేజ్‌లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సీన్ ట్రయల్స్‌లో ఎవరికి ఎంత డోస్ అవసరం అన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అలా తక్కువ డోస్ ఇస్తూ ఎక్కువ యాంటీబాడీలు విడుదలయ్యేలా కంపెనీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. అలా తక్కువ డోస్‌లోనే ఎక్కువ యాంటీబాడీలు విడుదలయ్యేలా చూడాల్సింది ఉంటుంది. అయితే, కొన్ని కంపెనీలు ఇప్పటికే జరిపిన పరీక్షల్లో పెద్ద వాళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పిల్లల్లో కూడా వస్తున్నట్లు తేలింది. అలసట, తల నొప్పి రావడం, కొద్దిగా జ్వరం రావడం లాంటి లక్షణాలు కనిపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ లక్షణాలు రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఉంటున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ పిల్లలపై చేపట్టిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. 12 నుంచి15 ఏళ్ల పిల్లలపై ఆ వ్యాక్సిన్ సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేసినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. ఈ నేపథ్యంలోనే అత్యవసర వినియోగానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఇటీవల ఆమోద ముద్ర వేసింది. దీంతో అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి మార్గం సుగ‌మ‌మైంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) కూడా అనుమతి ఇస్తే మరికొద్ది రోజుల్లోనే అమెరికాలో 12 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

కెనడా ప్రభుత్వం కూడా 12ఏళ్లు దాటిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కిందటి వారంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12 నుంచి 15ఏళ్ల లోపు వారిపై ఫైజర్ వ్యాక్సిన్ కెనడాలో జరిపిన క్లీనికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. పిల్లలపై కూడా ఈ టీకా 100శాతం ప్రభావవంతంగా పని చేయడంతో.. కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తొలి దేశం కెనడానే అని చెప్పాలి. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇప్పటి వరకూ పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. కేవలం 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్నారు.

పలు శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. కరోనా పిల్లల్లో ఎక్కువగా వ్యాపించట్లేదని, ముఖ్యంగా 18 ఏళ్ల లోపు పిల్లలకు దీని ముప్పు చాలా తక్కువగా ఉందని వెల్లడైంది. అయితే, వీరికి కరోనా సోకదని కచ్చితంగా చెప్పలేమన్నారు. పన్నెండేళ్ల కంటే చిన్న పిల్లల్లో కరోనా వచ్చినా లక్షణాలు ఎక్కువగా కనిపించవని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు దీని ముప్పు చాలా తక్కువగా ఉంటుందంటున్నారు. అయితే, ఈ అధ్యయనాలు ఇలా చెబుతుంటే.. పిల్లల్లో లక్షణాలు తక్కువగానే ఉన్నా, ఇటీవల కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా థర్డ్​వేవ్​పిల్లలపైనే ఎక్కువగా విరుచుకుపడే అవకాశం ఉందని వస్తున్న వార్తలు అందరిలో కలవరం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలలో పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి.

Also read:

Annapurna Meals : లాక్ డౌన్‌లో అన్నార్తుల ఆక‌లి తీరుస్తున్న అన్న‌పూర్ణ భోజ‌నం.. ఇప్పుడు గ్రేటర్లో రోజూ 45వేల మందికి..

Hyderabad Police: ఆన్‌లైన్‌లో కోవిడ్ మెడిసిన్స్.. ప్రజలను అలర్ట్ చేస్తోన్న‌ హైదరాబాద్ పోలీసులు