Akhil Akkineni: హిట్ కోసం అక్కినేని హీరో కసరత్తు.. సాలిడ్ కథను సిద్ధం చేస్తున్న సురేందర్ రెడ్డి..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ కు అర్జెంట్ గా హిట్ కావాలి. చేసిన మూడుసినిమాలు ప్రేక్షకుల్లాను ఆకట్టుకోలేక పోయాయి. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఈ కుర్రహీరో చూస్తూనే ఉన్నాడు.

Akhil Akkineni: హిట్ కోసం అక్కినేని హీరో కసరత్తు.. సాలిడ్ కథను సిద్ధం చేస్తున్న సురేందర్ రెడ్డి..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 13, 2021 | 3:57 PM

Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ కు అర్జెంట్ గా హిట్ కావాలి. చేసిన మూడుసినిమాలు ప్రేక్షకుల్లాను ఆకట్టుకోలేక పోయాయి. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఈ కుర్రహీరో చూస్తూనే ఉన్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి. వినాయక్ దర్శకత్వంలో చేసాడు అఖిల్. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత అక్కినేని ఫ్యామిలీకి మనం వంటి మెమరబుల్  హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేసాడు అఖిల్. హలో అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాకూడా హిట్ అందుకోలేక పోయింది.  ఆతర్వాత వెంకీ అట్లురి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమా కాస్త పర్వాలేదనిపించుకున్న అంతగా హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. ప్రస్తుతం డైరెక్టర్ బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తునన్నాడు అఖిల్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ టీజర్ సినిమా పైన ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా అఖిల్ ఏజెంట్ అనే సినిమాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో అఖిల్ డిఫరెంట్ రోల్ లో నటించనున్నట్లుగా తెలుస్తోంది.ఈ సారి మాస్ లుక్ తో .. వాళ్లకి కనెక్ట్ అయ్యే పాత్రలో అఖిల్ ను సురేందర్ రెడ్డి చూపించనున్నాడు. ప్రస్తుతం కథపై గట్టిగానే కసరత్తు జరుగుతోందట. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ వారితో కలిసి సురేందర్ రెడ్డి నిర్మించే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Indian 2 : ముదురుతున్న భారతీయుడు వివాదం.. సినిమా ఆలస్యానికి వారే కారణమన్న శంకర్..

ప్యాన్ ఇండియా మూవీస్‌పై మనసు పారేసుకున్న ఎన్టీఆర్… వరుసగా స్టార్ డైరెక్టర్స్‌కు గ్రీన్ సిగ్నల్..

Shivani: తమిళ్ ఇండస్ట్రీలోకి రాజశేఖర్ కూతురు…ఆ స్టార్ హీరో సరసన నటించనున్న శివానీ..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు