AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Reddy: జస్ట్ డస్ట్ బిన్…ఈసారి నేరుగా ప్రభుదేవాను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియా వేదికగా..

వివాదాలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీరెడ్డి.  పరిశ్రమలో చిన్న వాళ్ళ దగ్గరనుంచి పెద్ద వాళ్ళ వరకు అందరిని టార్గెట్ చేసి తనదైన శైలిలో  విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు శ్రీరెడ్డి.

Sri Reddy: జస్ట్ డస్ట్ బిన్...ఈసారి నేరుగా ప్రభుదేవాను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియా వేదికగా..
Rajeev Rayala
|

Updated on: May 13, 2021 | 8:07 PM

Share

Sri Reddy: వివాదాలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీరెడ్డి.  పరిశ్రమలో చిన్న వాళ్ళ దగ్గరనుంచి పెద్ద వాళ్ళ వరకు అందరిని టార్గెట్ చేసి తనదైన శైలిలో  విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు శ్రీరెడ్డి. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్న ఆమె ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఈ సారి ఏకంగా కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ ప్రభుదేవాను టార్గెట్ చేసారు శ్రీరెడ్డి. ప్రభుదేవాను జస్ట్ ఏ డస్ట్ బిన్ అంటూ సంబోధిస్తూ ఆమె వ్యాఖ్యలు చేసారు. ప్రభుదేవా పై శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకు ఆమె ప్రభుదేవాను టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే.. ప్రభుదేవా ఇటీవల బాలీవుడ్ లో బిజీ దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన సల్మాన్ ఖాన్ హీరోగా రాధే అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. ఈ సినిమాకు తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చారు శ్రీరెడ్డి.

రాధే మూవీ వన్ లైన్ రివ్యూ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. సినిమా చరిత్రలోనే చెత్త సినిమా ఇది. సల్మాన్ ఖాన్ గోప్ప నటుడు కానీ ప్రభుదేవా సినిమాను నాశనం చేసాడు. చెత్త డైరెక్షన్, వరస్ట్ స్టోరీ. ఇది ఒక డస్ట్ బిన్ ఛి ఛి అంటూ రాసుకొచ్చింది శ్రీరెడ్డి.  ఇక సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో దిశాపటానీ హీరోయిన్‌గా నటించింది. రాధే మూవీలో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు సల్మాన్‌. డైరెక్టర్‌గా సల్మాన్‌తో ప్రభుదేవాకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్ల కాంబోలో పోకిరీ రీమేక్ వాంటెడ్, దబ్బంగ్3 వచ్చాయి. డీఎస్‌పీ మార్క్ వున్న క్రేజీ బీట్‌…. సీటీమార్‌…. రాధే మూవీలో జబర్దస్త్‌గా రిపీటైంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Akhil Akkineni: హిట్ కోసం అక్కినేని హీరో కసరత్తు.. సాలిడ్ కథను సిద్ధం చేస్తున్న సురేందర్ రెడ్డి..

Regina cassandra: క్రేజీ ఆఫర్ దక్కించుకున్న రెజీనా కాసాండ్రా.. బాలీవుడ్ లో ఈ సారి ఇలా..