Regina cassandra: క్రేజీ ఆఫర్ దక్కించుకున్న రెజీనా కాసాండ్రా.. బాలీవుడ్ లో ఈ సారి ఇలా..

రెజీనా కాసాండ్రా.. ఈ ముద్దుగుమ్మ పేరు తెలుగులో ఆమధ్య బాగానే వినిపించింది. సుధీర్ బాబు నటించిన శివ మనసులో శృతి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది...

Regina cassandra: క్రేజీ ఆఫర్ దక్కించుకున్న రెజీనా కాసాండ్రా.. బాలీవుడ్ లో ఈ సారి ఇలా..
regina-cassandra
Follow us
Rajeev Rayala

|

Updated on: May 13, 2021 | 3:26 PM

Regina cassandra: రెజీనా కాసాండ్రా.. ఈ ముద్దుగుమ్మ పేరు తెలుగులో ఆమధ్య బాగానే వినిపించింది. సుధీర్ బాబు నటించిన ‘శివ మనసులో శృతి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత సందీప్ కిషన్ నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తిపుతెచ్చుకుంది. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. తెలుగులో వరుసగా సినిమాలు చేసినా సరైన హిట్ అందుకోలేక పోయింది. అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది పలు వైవిధ్య పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ‘ఎవరు’ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో నటించి ఆకట్టుకుందీ చిన్నది. ఈ సినిమా విజయవంతమవడంలో కీలకపాత్ర పోషించిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే రెజీనా మరోసారి విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. విశాల్‌ హీరోగా తెరకెక్కిన ‘చక్ర’ సినిమాలో ‘లీలా’ పాత్రలో నటించిన రెజీనా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఈ అమ్మడుకి అదిరిపోయే ఆఫర్ దక్కిందని తెలుస్తుంది. తాజా అప్ డేట్ ప్రకారం.. ఓకే  క్రేజీ వెబ్ సిరీస్ కి  రెజీనా ఎంపికైందని తెలుస్తుంది.

`రాకెట్ బోయ్స్` వెబ్ సిరీస్ లో కీలక పాత్రకు రెజీనా ఎంపికైంది. రాకెట్ బోయ్స్ వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ ఉంది. ఇదో సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్. అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన  ఏపీజే అబ్దుల్ కలాం- విక్రమ్ సారాభాయ్- హోమీ బాబా లాంటి మేథావుల ఇతి వృత్తం ఆధారంగా  ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు.బాలీవుడ్ లో రాయ్ కపూర్ ఫిల్మ్స్ అండ్ ఎమ్మీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా  ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో రెజీనా భాగమవ్వడం లక్కీ అనే చెప్పాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

పెళ్లి పై ఓపెన్ కామెంట్స్ చేసిన రష్మిక.. ఎప్పటికీ ఆ ఇంటి కోడలిని మాత్రమే అంటూ కన్ఫార్మ్ చేసిన కన్నడ బ్యూటీ..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఇలా ఉండబోతుందట..!

Indian 2 : ముదురుతున్న భారతీయుడు వివాదం.. సినిమా ఆలస్యానికి వారే కారణమన్న శంకర్..