పెళ్లి పై ఓపెన్ కామెంట్స్ చేసిన రష్మిక.. ఎప్పటికీ ఆ ఇంటి కోడలిని మాత్రమే అంటూ కన్ఫార్మ్ చేసిన కన్నడ బ్యూటీ..

కన్నడ కుట్టి.. తమిళ పొన్నుగా మారాలనుకుంటుంది. అరవ సంప్రదాయం అంటేనే ఇష్టమంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా.

పెళ్లి పై ఓపెన్ కామెంట్స్ చేసిన రష్మిక.. ఎప్పటికీ ఆ ఇంటి కోడలిని మాత్రమే అంటూ కన్ఫార్మ్ చేసిన కన్నడ బ్యూటీ..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: May 13, 2021 | 3:00 PM

కన్నడ కుట్టి.. తమిళ పొన్నుగా మారాలనుకుంటుంది. అరవ సంప్రదాయం అంటేనే ఇష్టమంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా.. కోలీవుడ్ పైనే మనస్సు పారేసుకుంది. తాను ఏడడుగులు నడిచేది.. తమిళనాడులోనే అని స్పష్టం చేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? అదే మన రష్మిక మందన్నా. ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావడమే లక్ష్యమంటూ తన మనస్సులోని మాటను భయటపెట్టింది.

కన్నడ భామ రష్మిక మండన్నా.. తెలుగులో బిజీ హీరోయిన్ అయ్యింది. ”గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, బీష్మ” సినిమాలతో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రష్మిక. ఇటీవల సరిలేరు నీకెవ్వరు  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు  ప్రస్తుతం పుష్పలో బన్నీ సరసన నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా మూడో మూవీకి సైన్ చేసినట్లు తానే స్వయంగా ప్రకటించింది. బిగ్ బీ అమితాబ్ తో కూడా నటిస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా తన మనస్సులోని మాట భయటపెట్టింది. పెళ్లిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ.. తానెప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనే కోరిక ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలే తమిళంలో కార్తీతో సుల్తాన్ మూవీ ద్వారా కోలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే తమిళ సంప్రదాయాలన్నా.. వారి జీవన విధానమన్నా తననెంతో ఆకట్టుకున్నాయని.. వివరించింది. అక్కడి సంస్కృతి తననెంతో ఆకట్టుకుందంటూ వివరించింది. ముఖ్యంగా తమిళ వంటకాలంటే తనకు చెప్పలేనంత ఇష్టమని రష్మిక తెలిపింది. తాను ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చింది. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపిన రష్మిక.. అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది.  అయితే అప్పటికే ఆమెకు ఆఫర్లు రావడంతో.. ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు తన పెళ్లి గురించి తన మనస్సులోని మాటను చెప్పుకొచ్చింది.

Also Read: Shivani: తమిళ్ ఇండస్ట్రీలోకి రాజశేఖర్ కూతురు…ఆ స్టార్ హీరో సరసన నటించనున్న శివానీ..

ప్యాన్ ఇండియా మూవీస్‌పై మనసు పారేసుకున్న ఎన్టీఆర్… వరుసగా స్టార్ డైరెక్టర్స్‌కు గ్రీన్ సిగ్నల్..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం