AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivani: తమిళ్ ఇండస్ట్రీలోకి రాజశేఖర్ కూతురు…ఆ స్టార్ హీరో సరసన నటించనున్న శివానీ..

యాక్షన్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ.. క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. చిన్న సినిమాలతోనే కెరీర్ ను లాగిస్తున్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు కోలీవుడ్ ఆఫర్ వచ్చింది.

Shivani: తమిళ్ ఇండస్ట్రీలోకి రాజశేఖర్ కూతురు...ఆ స్టార్ హీరో సరసన నటించనున్న శివానీ..
Rajashekar Shivani
Follow us
Rajitha Chanti

|

Updated on: May 13, 2021 | 1:41 PM

యాక్షన్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ.. క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. చిన్న సినిమాలతోనే కెరీర్ ను లాగిస్తున్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు కోలీవుడ్ ఆఫర్ వచ్చింది. ఏకంగా తమిళ సీఎం కుమారుడి మూవీలో నటించే అవకాశాన్ని అందుకుంది. బాలీవుడ్ లో భారీ హిట్ కొట్టిన మూవీకి.. తమిళ రీమేక్ లో నటించేందుకు సైన్ కూడా చేసేసింది. ఈ ఛాన్స్ తో లక్కీ గర్ల్ గా పేరుతెచ్చుకుంది శివానీ.

జీవితా రాజశేఖర్ గారాల పట్టి శివానీ రాజశేఖర్.. 2 స్టేట్స్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిదండ్రుల నుంచి నటనా వారసత్వాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తొలిమూవీతోనే ఆకట్టుకుంది. ప్రస్తుతం గుహన్ దర్శకత్వంలో W W W మూవీలో చేస్తుంది. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయినా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అలాగే తేజ సజ్జతో కూడా ఓ మూవీ చేసేందుకు శివానీ సైన్ చేసింది.

అయితే రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు ఇప్పటివరకు చిన్న సినిమాలతోనే సరిపెట్టుకుంటూ వచ్చారు. పెద్ద బ్యానర్ల నుంచి భారీ ఆఫర్లేవీ రాలేదు. కానీ ఫస్ట్ టైమ్.. పెద్దమ్మాయి శివానీ రాజశేఖర్ లక్కీ ఛాన్స్ అందుకుంది. ప్రస్తుత తమిళనాడు సీఎం కుమారుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మూవీలో నటించే అవకాశం అందుకుంది. బాలీవుడ్ లో హిట్ అయిన సామాజిక సందేశాత్మక చిత్రం ఆర్టికల్ 15 మూవీని.. తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించే అవకాశం శివానీ రాజశేఖర్ ను వరించింది. అరుణ్‌రాజ కామరాజ్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను.. బోనీకపూర్‌ సమర్పిస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే.. శివానీ కెరీర్ కీలక మలుపు తీసుకుంటుందని చెబుతున్నారు.

Also Read: ప్యాన్ ఇండియా మూవీస్‌పై మనసు పారేసుకున్న ఎన్టీఆర్… వరుసగా స్టార్ డైరెక్టర్స్‌కు గ్రీన్ సిగ్నల్..

Nidhi Agerwal: కుక్క తప్పిపోయింది.. పట్టిస్తే లక్ష రూపాయాలు రివార్డ్.. ఇస్మార్ట్ బ్యూటీ పోస్ట్ వైరల్..

కాబోయేవాడి గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన సురేఖా వాణి కూతురి.. నెటిజన్లతో ముచ్చటించిన సుప్రిత..

అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.?
అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.?
సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?
సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?
దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట
ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట
చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!
చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!
ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా
ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా
శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..