AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాబోయేవాడి గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన సురేఖా వాణి కూతురి.. నెటిజన్లతో ముచ్చటించిన సుప్రిత..

Supritha: క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి

కాబోయేవాడి గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన సురేఖా వాణి కూతురి.. నెటిజన్లతో ముచ్చటించిన సుప్రిత..
Supritha
Rajitha Chanti
|

Updated on: May 13, 2021 | 9:03 AM

Share

Supritha: క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. ఇదిలా ఉంటే.. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్ధరు కలిసి సోషల్ మీడియా చేసే రచ్చ మాములుగా ఉండదు. తమ వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు సురేఖా వాణి. గతంలో సురేఖా వాణి సెకండ్ మ్యారెజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే ఈ వార్తలపై సురేఖా వాణి స్పందించి తాను.. రెండో పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ షోలో పాల్గోన్న ఈ నటి తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను చెప్పుకున్నారు. ఇక తల్లితోపాటు ఆమె కూతురు సుప్రితకు కూడా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. తాజాగా సుప్రిత తన అభిమానులతో ముచ్చటించేందుకు లైవ్ లోకి వచ్చారు. ఈ క్రమంలో ఎన్నో ప్రశ్నలకు సుప్రిత సమాధానం ఇచ్చారు. అభిమానులు హాయ్ అంటూ పదే పదే మెసెజ్‌లు పెడుతుండటంతో బోర్ కొడుతోందని సుప్రిత వాపోయారు.

ఏవైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతా అంటూ సుప్రిత తన ఫాలోవర్లను కోరారు. దీంతో నెటిజన్లు ఆమె పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కొక్కరు ఒక్క రకమైన ప్రశ్నలు వేశారు. మీరు మీ మొబైల్ లో ఏ యాప్స్ వాడుతున్నారు ?, మీరు ఖాళీగా ఉంటే ఏం చేస్తారు ? , మీ నాన్న ఎలా చనిపోయారు ? తన గురించి ఏమైనా చెప్పండి ? అంటూ రకరకాల ప్రశ్నలు వేసారు. ఇవే కాకుండా.. బాయ్ ఫ్రెండ్, ప్రేమ, హీరోయిన్ ఎంట్రీపైనా ప్రశ్నలు వేశారు. అందులో తన పెళ్లి గురించి చెప్పిన సమాధానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి వాడు రావాలని కలలు కంటున్నావ్ అని ఓ నెటిజన్ అడిగాడు. నాకు పెద్దగా కోరికలేవీ లేవు గానీ.. ఓవర్ థింకింగ్ ఉండకూడదు..ఎక్కువగా ఆలోచించకూడదు.. నా పిచ్చిని భరించే వాడై ఉండాలి అంటూ ఆసక్తికర మాటలు చెప్పుకోచ్చింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని మరొకరు అడగడంతో ఇంకా.. రెండు మూడు సంవత్సరాలు పడుతుందని తెలిపింది సుప్రిత.

Also Read: నేను విసిగిపోయాను.. ఇలాంటి రూమర్స్ గురించి ఏం చెప్పాలో తెలియడంలేదు.. మరణవార్తలపై స్పందించిన శక్తిమాన్ నటుడు..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?