AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను విసిగిపోయాను.. ఇలాంటి రూమర్స్ గురించి ఏం చెప్పాలో తెలియడంలేదు.. మరణవార్తలపై స్పందించిన శక్తిమాన్ నటుడు..

Mukesh Khanna: శక్తిమాన్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా మంచి గుర్తింపు పొందాడు. తాజాగా తన మరణ వార్తలపై

నేను విసిగిపోయాను.. ఇలాంటి రూమర్స్ గురించి ఏం చెప్పాలో తెలియడంలేదు.. మరణవార్తలపై స్పందించిన శక్తిమాన్ నటుడు..
Shaktimaan
Rajitha Chanti
|

Updated on: May 12, 2021 | 9:20 AM

Share

Mukesh Khanna: శక్తిమాన్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా మంచి గుర్తింపు పొందాడు. తాజాగా తన మరణ వార్తలపై ఈ నటుడు స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తన ఇన్‏స్టాగ్రామ్ లైవ్‏లోకి వచ్చిన ముఖేష్ ఖన్నా నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అంటూ తన అభిమానులకు తెలియజేశాడు.

ముఖేష్ ఖన్నా.. మహాభారతంలో భీష్మ పితామహ పాత్రను పోషించి ప్రేక్షకులకు చెరువయ్యారు. శక్తీమాన్, మహాభారతం మాత్రమే కాకుండా.. పలు చిత్రాలు, టీవీ షోస్ లలో చేశాడు. ఇటీవల ఈ నటుడు మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీంతో తనకు తన స్నేహితులు, బంధువుల నుంచి కాల్స్ వస్తున్నాయని ముఖేష్ కన్నా తెలిపారు. గతంలో లక్కీ అలీ, కిర్రోన్ ఖేర్, షబ్నం వంటి ప్రముఖులు కూడా మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు నాశనాన్ని సృష్టిస్తారని ఆయన అన్నారు. ఇలాంటి వారిని పట్టుకోని చంపేయాలి అని ముఖేష్ ఖన్నా అన్నారు. తన అభిమానులు, సన్నిహితుల ఆశీర్వాదంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని ముఖేష్ ఖన్నా తెలిపారు.

ఈ క్రమంలోనే తన మరణ వార్తలపై స్పందిస్తూ.. నేను విసిగిపోయాను… అక్షరాల విసిగిపోయాను. భయం, గందరగోళం, ఆందోళన మాత్రమే కలిగించే ఇలాంటి రూమర్స్ గురించి ఏమి చెప్పాలో, ఏం చేయాలో నాకు తెలియడం లేదు. దాదాపు నా స్నేహితులు, బంధువులందరూ ఇప్పుడు నాకు కాల్స్ చేస్తున్నారు. నేను సంతోషంగా ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నా గురించి ఇలాంటి పుకార్లు రావడంపై భయంకరంగా ఉంది. ఇలాంటి వార్తలపై నాపైనే కాదు.. నా కుటుంబం మీద కూడా ఒత్తిడిని కలిగిస్తోంది. ఇక గత వారం అనుప్మా ఖేర్ తన భార్య కిర్రోన్ ఖేర్ మరణం గురించి వచ్చిన పుకార్ల గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈఏడాది ప్రారంభంలో ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లుగా తేలింది. కిర్రోన్ ఖేర్ ఆరోగ్యం బాగుంది. ఆమె ఇవాళ కోవిడ్ సెకండ్ డోసు టీకా వేసుకుంది. దయచేసి ఇలాంటి అసత్యపు వార్తలను షేర్ చేయకండి అని వేడుకున్నాడు.

వీడియో..

Also Read: కోవిడ్ కష్టాల్లో అండగా రేణు దేశాయ్.. అవసరంలో ఉన్న వాళ్ల డీటెయిల్స్ పంపితే సాయం చేస్తా అంటూ..