Pooja Bedi: కూతురి ప్రేమాయణంపై బాలీవుడ్ సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్.. అతడితో..

Pooja Bedi: కరోనా కహానీలను కాసేపు పక్కన పెడితే.. ఓ ప్రేమ కథ గురించి చెప్పుకుందాం. ఆలయ, ఐశ్వర్యా ఠాకూర్ మధ్య ప్రేమాయణం

Pooja Bedi: కూతురి ప్రేమాయణంపై బాలీవుడ్ సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్.. అతడితో..
Pooja Bedi
Follow us
Rajitha Chanti

|

Updated on: May 12, 2021 | 3:03 PM

Pooja Bedi: కరోనా కహానీలను కాసేపు పక్కన పెడితే.. ఓ ప్రేమ కథ గురించి చెప్పుకుందాం. ఆలయ, ఐశ్వర్యా ఠాకూర్ మధ్య ప్రేమాయణం గురించి తెలుసు కదా. మరాఠా పొలిటికల్ స్క్రీన్ పై.. బాలీవుడ్ సినిమా కథ నడుపుతున్న ఈ లవ్ ట్రాక్ పై.. పూజా బేడీ షాకింగ్ కామెంట్స్ చేసింది. వాళ్లిద్దరి రిలేషన్ పై తన స్టైల్లో ఓ వెర్షన్ చెప్పుకొచ్చింది.

ఒకప్పటి బాలీవుడ్ నటి పూజాబేడీ తన కుమార్తె ప్రేమాయణం పై చేసిన వ్యాఖ్యలు.. బీటౌన్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. పూజాబేడీ కూతురు ఆలయ, బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరీ ఠాక్రే.. లవ్ లో ఉన్నారనే రూమర్ చాలాకాలంగా వినిపిస్తుంది. వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరన్నట్టుగా.. ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. పబ్ లు, పార్టీలు, లేట్ నైట్ డిన్నర్లలో కూడా ఈ జంటే హైలెట్ గా నిలుస్తుంది. ఇటీవలే ఆలయ.. తన బర్త్ డే వేడుకలను దుబాయ్ లో జరుపుకుంది. అక్కడ ఐశ్వరీ ఠాక్రేతో ఆలయ కలిసి ఉన్న ఫోటోలు మీడియాకు చిక్కడంతో.. అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇటు ఐశ్వరీ తన తల్లితో పాటు.. ఆలయతో కలిసి లంచ్ చేసిన దృశ్యాలు కూడా బయటకు రావడంతో.. వీళ్లిద్దరి ప్రేమ మరింత ముదిరిందనే వాదనలు వినిపించాయి.

దీంతో ఈ రూమర్స్ కు చెక్ పెట్టేలా.. ఆలయ స్పందించింది. ఐశ్వరీతో ఉన్నది స్నేహబంధం మాత్రమే అని చెప్పుకొచ్చింది. అయినా రూమర్స్ ఆగకపోవడంతో.. ఆలయ తల్లి పూజాబేడీ కూడా రంగంలోకి దిగింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజా.. కేవలం ఊహాగానాలతోనే వ్యక్తిగత జీవితాన్ని అంచనా వేయొద్దంటూ క్లాస్ పీకింది. ఎక్కడ చూసిన ఆలయ న్యూస్ మాత్రమే వినిపిస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తూనే.. ఈ రోజుల్లో ఏ వయసులో ఎలా ఉండాలనే దాన్ని అంచనా వేయొద్దంటూ చెప్పుకొచ్చింది. ఒక నటి వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపే హక్కు తనకుందని వివరించింది.

ఇటీవలే సైఫ్ అలీఖాన్, టబు నటించిన జవానీ జానేమన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆలయ. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే దక్కాయి. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ పెద్దల చూపును తనవైపు తిప్పుకుంటున్న ఆలయ.. మరిన్ని మూవీస్ కు సిద్ధమవుతోంది.

Also Read: నేను విసిగిపోయాను.. ఇలాంటి రూమర్స్ గురించి ఏం చెప్పాలో తెలియడంలేదు.. మరణవార్తలపై స్పందించిన శక్తిమాన్ నటుడు..