AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్యాన్ ఇండియా మూవీస్‌పై మనసు పారేసుకున్న ఎన్టీఆర్… వరుసగా స్టార్ డైరెక్టర్స్‌కు గ్రీన్ సిగ్నల్..

Jr. NTR next movie: ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ తో ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్షన్, డైరెక్షన్ తో ఓ మూవీని ఏ రేంజ్ లో తీయొచ్చో చూపించాడు.

ప్యాన్ ఇండియా మూవీస్‌పై మనసు పారేసుకున్న ఎన్టీఆర్...  వరుసగా స్టార్ డైరెక్టర్స్‌కు గ్రీన్ సిగ్నల్..
Jr. NTR
Rajitha Chanti
| Edited By: Team Veegam|

Updated on: May 13, 2021 | 12:53 PM

Share

ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ తో ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్షన్, డైరెక్షన్ తో ఓ మూవీని ఏ రేంజ్ లో తీయొచ్చో చూపించాడు. అలాంటి డైరెక్షన్ లో పనిచేయాలని.. చాలామంది హీరోలు కోరుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ తీస్తున్న ప్రశాంత్ నీల్.. మరో మాస్ హీరోతో కమిట్ అయ్యారు.

హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసిన మూవీ కేజీఎఫ్. బంగారు గనులపై ఆదిపత్యం, కూలీల బతుకు చిత్రం, తల్లిబిడ్డల ప్రేమపై తీసిన సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశాయి. కేజీఎఫ్ ను చూసిన బాహుబలి ప్రభాస్ కూడా.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయాలని కోరుకుంటున్నాని ప్రకటించాడు. అన్నట్లుగానే.. వారిద్దరి కాంబినేషన్ లో సలార్ మూవీ వస్తుంది. అయితే ప్రశాంత్.. త్వరలోనే మరో టాలీవుడ్ హీరోతో మూవీ చేయనున్నారు. అతడెవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని.. ఎన్టీఆరే స్వయంగా ప్రకటించాడు. కరోనాతో క్వారంటైన్ లో ఉన్న ఎన్టీఆర్.. ఇంగ్లిష్ డైలీకి ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన 31 వ మూవీని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నట్లు ప్రకటించాడు.

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ ఉంటుందని.. గతకొద్దిరోజుల నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఎన్టీఆరే స్వయంగా చెప్పేయడంతో.. కన్ఫ్యూజన్ పై క్లారిటీ వచ్చినట్లైంది. ప్రస్తుతం రాజమౌళీ డైరెక్షన్ లో ట్రిపుల్ ఆర్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివతో సెకండ్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని వివరించాడు. ఈ రెండింటి తర్వాతే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ ఉంటుందని స్పష్టం చేశాడు.

ఎన్టీఆర్ అనౌన్స్ మెంట్ తో.. ఎన్టీఆర్ విత్ ప్రశాంత్ నీల్ అనే హ్యష్ ట్యాగ్.. ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ట్రిపుల్ ఆర్ విడుదలపై కూడా ఎన్టీఆర్ క్లూ ఇచ్చాడు. ఈ దసరాకు.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. దీంతో ఎన్టీఆర్ వరుసగా మూడు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నట్లు తేలిపోయింది.

Read more: Nidhi Agerwal: కుక్క తప్పిపోయింది.. పట్టిస్తే లక్ష రూపాయాలు రివార్డ్.. ఇస్మార్ట్ బ్యూటీ పోస్ట్ వైరల్..

కాబోయేవాడి గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన సురేఖా వాణి కూతురి.. నెటిజన్లతో ముచ్చటించిన సుప్రిత..

అతను అడిగాడు.. నేను ఓకే అన్నాను..! మిహికబజాజ్.. రానాకు ఒకే చెప్పి నేటికి ఏడాది.. వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..