AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఇలా ఉండబోతుందట..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా షూటింగ్ లో చాల బిజీగా ఉన్నాడు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం..

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఇలా ఉండబోతుందట..!
కీర్తి సురేష్..
Rajeev Rayala
|

Updated on: May 13, 2021 | 2:57 PM

Share

Sarkaru Vaari Paata:

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా షూటింగ్ లో చాల బిజీగా ఉన్నాడు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ సినిమా మహేష్ న్యూ లుక్ లో మరింత స్టైలిష్ గా కనిపించనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరశురామ్. ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. దుబాయ్ లో సర్కారు వారి పాట సినిమాకు సంబంధిచిన భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఈ సీన్స్ లో భారీ ఛేజింగ్ కూడా చిత్రీకరించారట. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ , లీకైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్రయూనిట్ . ఇటీవలే హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలు పెట్టారు. కరోనా నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. దాంతో మహేష్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందట. మరో రెండు నెలల్లో కరోనా ఉదృతి తగ్గితే జులై నుంచి షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తున్నారట.. అయితే ఈ సినిమాకు సంబంచిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేష్ బ్యాంక్ మేనేజర్ గా కనిపిస్తాడట. అదే బ్యాంక్ లో ఉద్యోగినిగా కీర్తి సురేష్ కనిపిస్తుందిట. ఇక కామెడీకి పెద్ద పీట వేస్తూ హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్గా తీర్చిదిద్దుతున్నారని టాక్. సంక్రాంతి  కానుకగా ఈ సినిమాను రీలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Indian 2 : ముదురుతున్న భారతీయుడు వివాదం.. సినిమా ఆలస్యానికి వారే కారణమన్న శంకర్..

Shivani: తమిళ్ ఇండస్ట్రీలోకి రాజశేఖర్ కూతురు…ఆ స్టార్ హీరో సరసన నటించనున్న శివానీ..

ప్యాన్ ఇండియా మూవీస్‌పై మనసు పారేసుకున్న ఎన్టీఆర్… వరుసగా స్టార్ డైరెక్టర్స్‌కు గ్రీన్ సిగ్నల్..

ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో