Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయకు ఆన్‏లైన్‏లో జువెల్లరీ కొంటున్నారా ? అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే.. లేదంటే ఇబ్బందులు తప్పవు..

Akshya Tritiya 2021: కరోనా మహమ్మారి సృష్టించిన మారణ హోమాన్ని తగ్గించేందుకు దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ విధానాన్ని అమలుచేస్తోంది.

అక్షయ తృతీయకు ఆన్‏లైన్‏లో జువెల్లరీ కొంటున్నారా ? అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే.. లేదంటే ఇబ్బందులు తప్పవు..
Akshya Tritiya 2021
Follow us
Rajitha Chanti

|

Updated on: May 13, 2021 | 4:14 PM

Akshya Tritiya 2021: కరోనా మహమ్మారి సృష్టించిన మారణ హోమాన్ని తగ్గించేందుకు దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ విధానాన్ని అమలుచేస్తోంది. దీంతో మరోసారి వ్యాపార సంస్థలపై భారం పడనుంది. మరీ ముఖ్యంగా ఈ నెల 14న అక్షయ తృతీయ కావడంతో బంగారు షాపులపై నష్టం తీవ్రంగానే ఉండనుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఇంటికి మహాలక్ష్మిని తీసుకొచ్చినట్టేనన్న నమ్మకం చాలామందిలో ఉంది. కానీ ఈసారి అక్షయ తృతీయ రోజు లాక్‌డౌన్ కారణంగా బంగారు దుకాణాలు తెరుచుకునే పరిస్థితి లేదు. అందుకే కొందరు ఆభరణా వ్యాపారులు ఆన్‌లైన్‌లో బంగారు నగలను అమ్ముతున్నారు. ఇక అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనుకునేవారు ఆన్ లైన్ లో అయిన పరవలేదు బంగారం కొనేస్తామంటూ ముందుకు వస్తున్నారు. కానీ ఆన్ లైన్ లో బంగారం కొనడం ఎంత వరకు మంచిది… కొనడానికి ముందు ఎలాంటి టిప్స్ పాటించాలి ? అనే విషయాలను మాత్రం గమనించడం లేదు. మరీ ఆన్ లైన్ లో నగలు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా.

ఆన్‌లైన్‌లో జువెల్లరీ కొనేముందు మీకు బంగారు నగలు, క్వాలిటీ, హాల్ మార్క్ వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఉండాలి. అలాగే ఆన్‌లైన్‌లో నగలు ఆర్డర్ చేసేముందు ఒకసారి వివరాలన్నీ సరిగ్గా చెక్ చేసుకోవాలి. ఆ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఫోటో చూసి ఆర్డర్ చేయకుండా డిస్క్రిప్షన్‌లోని వివరాలన్నీ పూర్తిగా చదివి తెలుసుకోవాలి. నగల క్వాలిటీ హాల్‌మార్క్, మేకింగ్ ఛార్జీల వివరాలు తెలుసుకోవాలి. నగలు డెలివరీ అయిన తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో నగలు ఆర్డర్ చేసేముందు రిటర్న్, రీప్లేస్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. రిటర్న్, రీప్లేస్ పాలసీ నియమనిబంధనలు పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. రిటర్న్ ఆప్షన్ ఉన్న సైట్లను ఎంచుకోని ఆర్డర్ చేయడం మంచిది. డిస్కౌంట్స్, ఆఫర్స్ వివరాలు కూడా చెక్ చేయాలి. అక్షయ తృతీయ కాబట్టి బంగారం షాపులన్నీ ఆఫర్స్ అందిస్తాయి. ఆన్‌లైన్‌లో జువెల్లరీ కొనడానికి ఏ వెబ్‌సైట్ కనిపిస్తే ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయొద్దు. నకిలీ సైట్లతో మోసపోయే అవకాశం లేకపోలేదు. ప్రముఖ సంస్థలకు చెందిన వెబ్‌సైట్స్ మాత్రమే చెక్ చేయాలి. అవసరమైతే వారికి ఫోన్ చేసి సరైన వెబ్‌సైట్ అడ్రస్ కనుక్కోవాలి. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు కూడా ఆన్‌లైన్‌లో నగల్ని అమ్ముతున్నాయి.

Also Read: మీ బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..