AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inhuman: విశాఖలో అమానుషం.. ఆసుపత్రి సిబ్బంది ఓవరాక్షన్.. క‌రోనా టెస్టింగ్ క్యూ లైన్‌లోనే మహిళ ప్రసవం..!

అమానవీయం... అంతకంటే ఘోరం... ప్రెగ్నెంట్‌ అన్న కనికరం లేదు... పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు పరీక్ష పెట్టిన వైద్య సిబ్బంది. విశాఖ జిల్లా అడవివరం ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Inhuman: విశాఖలో అమానుషం.. ఆసుపత్రి సిబ్బంది ఓవరాక్షన్.. క‌రోనా టెస్టింగ్ క్యూ లైన్‌లోనే మహిళ ప్రసవం..!
Woman Delivers Baby While Waiting In Queue
Balaraju Goud
|

Updated on: May 13, 2021 | 3:54 PM

Share

Woman Delivers Baby in Q Line: అమానవీయం… అంతకంటే ఘోరం… ప్రెగ్నెంట్‌ అన్న కనికరం లేదు… పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు పరీక్ష పెట్టిన వైద్య సిబ్బంది. విశాఖ జిల్లా అడవివరం ఆరోగ్య కేంద్రంలో అరాచకం. గ‌ర్భిణీ అని కూడా చూడ‌కుండా కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే ఆప‌రేష‌న్ చేస్తామ‌ని ఆసుప‌త్రి వైద్యులు ప‌ట్టుబ‌ట్టడంతో… టెస్టు చేయించుకునేందుకు ఆమె క్యూ లైన్ లో నిల్చుంది. అదే స‌మ‌యంలో పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నా సిబ్బంది క‌నిక‌రించ‌లేదు. దీంతో క్యూలో ఉండ‌గానే ప్రస‌వించింది.

విశాఖ జిల్లా అడవివరం ఆరోగ్య కేంద్రంలో ఓ నిండు గర్భిణి ప్రాణాలతోనే చెలగాటమాడుకున్నారు ఆసుపత్రి సిబ్బంది. డెలివరీ కోసం అడవివరం ఆరోగ్య కేంద్రానికి వెళ్లిందామె. అయితే కరోనా టెస్టు చేయించుకొని వస్తేనే చేర్చుకుంటామని తెగేసి చెప్పారు అక్కడి వైద్యులు. బాధను భరిస్తూనే.. టెస్టులు జరుగుతున్న ప్లేస్‌కు వెళ్లింది ఆమె పరిస్థితి చూసి టెస్టులు త్వరగా చేసి పంపాల్సిన వైద్య సిబ్బంది లైట్ తీసుకున్నారు.

క్యూలో కూర్చున్న చోటే ఆడబిడ్డకు జన్మనచ్చిందామె. దీంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన అక్కడి వైద్య సిబ్బంది తల్లీ బడ్డను కేజీహెచ్‌కు తరలించారు. ప్రసవం అనంతరం.. మంజ్వార్​ను ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రసవానికి ఇంకా చాలా సమయం ఉందనే కరోనా టెస్టుకు పంపించామని సంజాయిషీ చెప్పుకునేందుకు ప్రయత్నించింది డాక్టర్ మాధవి. ప్రొటోకాల్ ప్రకారమే చెప్పామంటున్నారు. ఈ ఘటనతో వైద్యసిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహించడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Read Also…  Lock Down In Telangana: లాక్‌డౌన్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు..