Viral News: ఈ ప్రమాదకరమైన చేపలు సుమద్రంలో వేల అడుగుల లోతులో ఉంటాయి… కానీ

సముద్ర కూడా భూ ప్రపంచంలాగా మర్మమైనది. చాలా ప్రత్యేకమైనది కూడా. సముద్రపు లోతుల్లో తరచుగా ఏదో ఒక కొత్త జీవి ఉనికి కనిపిస్తుంది..

Viral News: ఈ ప్రమాదకరమైన చేపలు సుమద్రంలో వేల అడుగుల లోతులో ఉంటాయి... కానీ
Football Fish
Follow us

|

Updated on: May 13, 2021 | 8:51 PM

సముద్ర కూడా భూ ప్రపంచంలాగా మర్మమైనది. చాలా ప్రత్యేకమైనది కూడా. సముద్రపు లోతుల్లో తరచుగా ఏదో ఒక కొత్త జీవి ఉనికి కనిపిస్తుంది. దీనిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. సముద్రంలో ఎన్ని వింత జీవులు దాగి ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఈ జీవుల్లో ఒకటి పసిఫిక్ ఫుట్‌బాల్ ఫిష్. ఈ చేప చాలా ప్రమాదకరమైనది. ఇది ఒక రాక్ష‌సుడు మాదిరి ఆకారంలో ఉంటుంది. సమాచారం ప్రకారం ఈ చేప సముద్రం నుంచి 3 వేల అడుగుల లోతులో నివసిస్తుంది. ఈ అరుదైన చేపలు మ‌త్స‌కారుల‌కు చాలా రేర్ గా అరుదుగా కనిపిస్తాయి. అయితే, ఇటీవల ఈ చేప కాలిఫోర్నియాలో కనిపించింది. లాస్ ఏంజిల్స్ బోట్ టూర్ ఏజెన్సీ డేవిస్ లాకర్ స్పోర్ట్ ఫిషింగ్ & వేల్ వాచింగ్ అనే ఫేస్ బుక్ పేజీ ఈ చేప ఫోటోను షేర్ చేసింది.

Happy #MPA Monday! .

Last Friday morning an incredible deep sea fish washed up on shore in Crystal Cove State Park’s…

Posted by Crystal Cove State Park on Monday, 10 May 2021

పడవలో ఉన్న కొంతమంది మత్స్యకారులు చేపలను పట్టుకోవడానికి సముద్రంలో దిగినప్పుడు ఈ అరుదైన చేప దొరికింది. మత్స్యకారులు దానిని చూడగానే షాక్ కు గుర‌య్యారు. ఈ చేప చూడటానికి చాలా ప్రమాదకరంగా అనిపించింది. ఎందుకంటే దాని పళ్ళు చాలా పదునైనవి. ఈ చేప‌లు వాటి దంతాల స‌హాయంతో మ‌నుషుల చ‌ర్మాన్ని ఈజీగా చీల్చ‌గ‌ల‌వు. ఈ చేప ఆంగ్లర్‌ఫిష్ జాతికి సంబంధించిన‌దిగా చెబుతున్నారు.

Also Read: క‌రోనా వేళ యూపీఎస్‌సీ కీల‌క నిర్ణ‌యం.. ప‌రీక్ష‌ల తేదీలో మార్పులు చేస్తూ ప్ర‌క‌ట‌న‌..

మీ బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..