Actor Kamal Haasan: కమల్ హాసన్ వల్లే సినిమా ఆలస్యం అవుతుంది.. సంచలన కామెంట్స్ చేసిన దర్శకుడు

డైరెక్టర్ శంకర్‌, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ మధ్య వివాదం ముదురుతోంది. ఇండియన్‌ 2 షూటింగ్ శంకర్‌ కారణంగానే ఆలస్యమైందంటూ లైకా..

Actor Kamal Haasan: కమల్ హాసన్ వల్లే సినిమా ఆలస్యం అవుతుంది.. సంచలన కామెంట్స్ చేసిన దర్శకుడు
Kamal Haasan
Follow us
Rajeev Rayala

|

Updated on: May 13, 2021 | 8:35 PM

Kamal Haasan: డైరెక్టర్ శంకర్‌, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ మధ్య వివాదం ముదురుతోంది. ఇండియన్‌ 2 షూటింగ్ శంకర్‌ కారణంగానే ఆలస్యమైందంటూ లైకా… నా తప్పేంలేదంటూ శంకర్‌… కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే ఈ విషయం తాజాగా మరో టర్న్ తీసుకుంది. అసలు డిలేకు కారణం కమల్ హాసనే అంటూ బాంబు పేల్చారు శంకర్‌. ఇండియన్‌ 2 షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే సెట్‌లో యాక్సిడెంట్ అయ్యింది. ఆ తరువాత షూటింగ్ రీస్టార్ట్ చేద్దామనుకున్నా… తనకు మేకప్‌ ఎలర్జీ అంటూ కమల్ హాసన్‌ షూటింగ్‌కు హాజరు కాలేదన్నారు శంకర్‌. ఆ కారణంగా షూటింగ్ డిలే అయ్యిందని కోర్టుకు వివరించారు. ఆ తరువాత ఎన్నికల కారణంగా కమల్‌ సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవటంతో ఇండియన్‌ 2 పూర్తిగా పక్కన పడింది. ఈ ప్రాజెక్టు లేట్ అవుతూ ఉండటంతో శంకర్ మరో రెండు ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు. తెలుగులో రామ్ చరణ్ తో.. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు.

తమిళనాడు ఎన్నికల్లో ఫెయిల్ అయిన కమల్, తిరిగి సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. శంకర్‌, లైకా వివాదాన్ని కాంప్రమైజ్‌ చేసే బాధ్యత కూడా తీసుకోవాలనుకున్నారు. కానీ ఈ టైంలో కమల్ కారణంగానే ఇండియన్‌ 2 డీలే అవుతుంది అని శంకర్‌ కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఇన్ని మలుపుల తరువాత ఇండియన్‌ 2 కంప్లీట్ అవుతుందా..? చూడాలి మరి ఎం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Movie: స‌ల్మాన్ రేంజ్‌కు ఇదొక ఉదాహ‌ర‌ణ‌.. ‘రాధే’ కోసం ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌.. స‌ర్వ‌ర్ క్రాష్‌..

Radhe Movie: స‌ల్మాన్ రేంజ్‌కు ఇదొక ఉదాహ‌ర‌ణ‌.. ‘రాధే’ కోసం ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌.. స‌ర్వ‌ర్ క్రాష్‌..

ఇర్ఫాన్ పఠాన్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌.. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం..