Radhe Movie: స‌ల్మాన్ రేంజ్‌కు ఇదొక ఉదాహ‌ర‌ణ‌.. ‘రాధే’ కోసం ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌.. స‌ర్వ‌ర్ క్రాష్‌..

Radhe Movie: బాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో సల్మాన్‌ఖాన్ మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. స‌ల్లుభాయ్ నుంచి సినిమా వ‌చ్చిందంటే చాలు బాలీవుడ్‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది, రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయి. స‌ల్మాన్...

Radhe Movie: స‌ల్మాన్ రేంజ్‌కు ఇదొక ఉదాహ‌ర‌ణ‌.. ‘రాధే’ కోసం ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌.. స‌ర్వ‌ర్ క్రాష్‌..
Salman Radhe Movie
Follow us
Narender Vaitla

|

Updated on: May 13, 2021 | 8:27 PM

Radhe Movie: బాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో సల్మాన్‌ఖాన్ మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. స‌ల్లుభాయ్ నుంచి సినిమా వ‌చ్చిందంటే చాలు బాలీవుడ్‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది, రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయి. స‌ల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇది నిద‌ర్శ‌నం. అయితే స‌ల్మాన్ స్టామినా కేవ‌లం థియేట‌ర్ల‌కే ప‌రిమితం కాలేదు ఓటీటీలోనూ త‌న‌కు సాటిలేద‌ని చాటి చెప్పారు. స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కిన రాధే చిత్రం తాజాగా గురువారం ఓటీటీ వేదిక‌గా విడుద‌లైంది. ఈ సినిమాను మేక‌ర్స్ జీ5, జీప్లెక్స్ వేదిక‌ల్లో విడుద‌ల చేశారు. అయితే ఈ సినిమా విడుద‌లైన వెంట‌నే స‌ల్మాన్ అభిమానులు ఒక్క‌సారిగా లాగిన్ అయ్యారు. దీంతో స‌ర్వ‌ర్ క్రాష్ అయ్యింది. గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సల్మాన్ ఫ్యాన్స్ ఓటీటీలోకి లాగిన్ అయ్యారు దీంతో స‌ర్వ‌ర్లు స్తంభించిపోయాయి. అయితే స‌ర్వ‌ర్లు ఆగిపోవ‌డానికి గ‌ల కారణాలు స‌ద‌రు ఓటీటీ సంస్థ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఈ విష‌య‌మై ఓటీటీ సంస్థ‌లు ట్వీట్ చేస్తూ.. మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తున్నాం. త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాం. అని పేర్కొన్నారు. ఈ సినిమాకు ప్ర‌భుదేవా ద‌ర్శ‌కత్వం వ‌హించిన విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు సినిమాలు సూప‌ర్ హిట్ అయితే అభిమానులు థియేట‌ర్ల వ‌ద్ద క్యూ లైన్‌లో ర‌చ్చ చేసేవారు. అనంత‌రం బుక్ మై షో వంటి యాప్‌లు స‌ర్వర్లు డౌన్ అయ్యేవి. ఇప్పుడు కొత్త‌గా ఓటీటీ స‌ర్వ‌ర్లు కూడా స్థంభించిపోతున్నాయ‌న్న‌మాట‌.

Also Read: Boyapati Srinu: బాలయ్య అఖండ తర్వాత బోయపాటి సినిమా చేసేది ఆ హీరోతోనేనా..?

South Indian actress: సౌత్‌ బ్యూటీస్‌ డేట్స్ కోసం బాలీవుడ్ స్టార్స్‌ క్యూ.. మ‌న ముద్దుగుమ్మ‌ల‌కు అక్క‌డ భ‌లే డిమాండ్

Rakul Preet Singh: కోవిడ్ బాధితుల కోసం నేను సైతం అంటోన్న ర‌కుల్ ప్రీత్… మీకు తోచినంత సాయం చేయండంటూ..