AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chatrapathi Hindi Remake: ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్‌లో హీరోయిన్ ఎవ‌రో తెలుసా.? ఈ వార్త‌లో అయినా నిజం ఉందా.!

Chatrapathi Hindi Remake Heroine: 2005లో ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఛ‌త్ర‌ప‌తి సినిమా ఎంత‌టి సంచ‌లన విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌భాస్ కెరీర్‌ను..

Chatrapathi Hindi Remake: ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్‌లో హీరోయిన్ ఎవ‌రో తెలుసా.? ఈ వార్త‌లో అయినా నిజం ఉందా.!
Bellam Konda
Narender Vaitla
|

Updated on: May 13, 2021 | 10:32 PM

Share

Chatrapathi Hindi Remake Heroine: 2005లో ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఛ‌త్ర‌ప‌తి సినిమా ఎంత‌టి సంచ‌లన విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌భాస్ కెరీర్‌ను ఈ సినిమా ఓ మ‌లుపు తిప్పింది. మాస్ ప్రేక్ష‌కుల‌ను ద‌గ్గ‌ర చేసి స్టార్ హీరోల స‌ర‌స‌న నిల‌బెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే.

Sai Pallavi

Sai Pallavi

తెలుగులో ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోతున్న బెల్లంకొండ తెలుగులో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ రీమేక్‌కు వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్‌గా న‌టించేది ఎవ‌ర‌నే దానిపై గ‌త కొన్నిరోజులుగా ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జరుగుతోంది. మొద‌ట్లో ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోందని, త‌ర్వాత శ్ర‌ద్ధా క‌పూర్ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా మ‌రో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌లో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌య‌మై చిత్ర యూనిట్ ఇప్ప‌టికే సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించార‌ని దానికి ఆమె కూడా సానుకూలంగా స్పందించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి. ఇక సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో ల‌వ్‌స్టోరీ చిత్రంతో పాటు రానా హీరోగా తెర‌కెక్కుతోన్న‌ విరాటప‌ర్వంలో న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

Also Read: Sonu Sood: తారాస్థాయికి సోనూ ఇమేజ్‌.. విలన్‌గా చూపించేందుకు భయపడుతున్న మేకర్స్‌ !

Check movie in OTT: డిజిటల్ రిలీజ్ కు ‘చెక్’ రెడీ.. ఓటీటీలో అయినా హిట్ కొట్టేనా.. !

Ram Gopal Varma: మరో సినిమాతో రాబోతున్న వర్మ.. ఈసారి ప్రేక్షకులకు టాబ్లెట్ వేయనున్నాడు…